BRAOU: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన ఏప్రిల్ 14న విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనిర్వాన్‌మెంటల్ సైన్స్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లేదా 04023680411, 04023680241, 18005990101 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. మే 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు అభ్యర్థులు మే 8లోగా పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు..
* పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన-2023
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.04.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.05.2023.
* రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 12.05.2023.
* హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 16.05.2023 నుంచి.
* ప్రవేశ పరీక్షతేది: : 20.05.2023.
Also Read:
JNVS Entrance Exam: నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు గడువు సమీపిస్తున్న వేళ తాజాగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ జవహర్ నవోదయాలు దేశవ్యాప్తంగా 649 ఉన్నాయి. వీటిలో ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. వీటన్నింటిలో దాదాపు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
సిల్వర్ సెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..