News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SILVER CET: సిల్వర్ సెట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

FOLLOW US: 
Share:

కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు. 

ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌డెస్క్ 022-62507712 నంబరులో సంప్రదించవచ్చు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. 

వివరాలు..

* సిల్వర్ సెట్ - 2023

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: బీఏ, బీకామ్, బీఎస్సీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మూడు పేపర్లు ఇంటర్ సంబంధిత సబ్జెక్టుల నుంచి, ఒకటి ఇంగ్లిష్ పేపర్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.05.2023.

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.05.2023.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 18.05.2023.

➥ ఆన్‌లైన్ పరీక్షతేది: 25.05.2023.

Notification

Online Application

Website

Also Read:

జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్‌ విధానం: యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేంవర్‌ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్‌ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇదే కోవలో తాము నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేంవర్క్‌ను విడుదల చేశామని తెలిపారు. నేషనల్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌, నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌, నేషనల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌లను ఏకీకృతం చేశామని వివరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'టోఫెల్‌' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!
విదేశాల్లో ఉన్నతవిద్య కోసం వెళ్లాలనుకునే వారిలో 'ఇంగ్లిష్' నైపుణ్యాలను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 14 Apr 2023 06:05 AM (IST) Tags: Education News in Telugu SILVER CET - 2023 SILVER CET - 2023 Notification SILVER CET - 2023 Application SILVER CET - 2023 Entrance Exam

ఇవి కూడా చూడండి

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 రిపోర్టింగ్‌ గడువు పెంపు, ఎప్పటివరకంటే?

TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 రిపోర్టింగ్‌ గడువు పెంపు, ఎప్పటివరకంటే?

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ