National Credit Framework: జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్ విధానం: యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టంచేశారు.
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టంచేశారు. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇదే కోవలో తాము నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్‌ను విడుదల చేశామని తెలిపారు. నేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్, నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్‌లను ఏకీకృతం చేశామని వివరించారు.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసిన కొత్త నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సిఆర్‌ఎఫ్) ప్రకారం, పురాణాలు, వేదాలు మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థలోని ఇతర భాగాలలోని వివిధ అంశాలలో విద్యార్థుల నైపుణ్యానికి "క్రెడిటైజ్" ఇవ్వనున్నారు.
క్రెడిట్ విధానం ఇలా..
➥ వివిధ స్థాయిల్లో మార్కు స్థానంలో క్రెడిట్స్ ఇస్తారు.
➥ ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సెమిస్టర్లలో 30 గంటల బోధన (ఏదైనా సబ్జెక్టులో) తరగతులకు హాజరవ్వాలి.
➥ ప్రతీ సెమిస్టర్‌కి 20 క్రెడిట్స్ ఉంటాయి. ఏడాదికి అన్ని సబ్జెక్టులు కలిపి 1,200 గంటల బోధన సమయంలో విద్యార్థి 40 క్రెడిట్స్ పొందుతాడు.
➥ వృత్తి, నైపుణ్య విద్య లెవల్ 4.5 నుంచి లెవల్ 8 వరకు ఉంది.
➥ పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి 320 క్రెడిట్స్ రావాలి.
➥ బ్యాచిలర్ డిగ్రీ ముగిసేనాటికి 120 క్రెడిట్స్ పొందాలి.
➥ క్రెడిట్స్ మార్పిడి ఐటీఐ (రెండేండ్ల) కోర్సు పూర్తి చేసిన విద్యార్థి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి అదనపు భాషా కోర్సులను చదివితే ఇంటర్‌తో సమానంగా పరిగణిస్తారు.
➥ అకాడమికేతర అంశాలైన క్రీడలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ , మ్యూజిక్ , హెరిటేజ్ , ట్రెడిషనల్ సిల్స్ , ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్ ఇస్తారు.
తరగతులు | స్థాయిలు (లెవల్స్) |
5వ తరగతి వరకు | లెవల్-1 |
6 నుంచి 8వ తరగతి వరకు | లెవల్-2 |
9, 10 తరగతులకు | లెవల్-3 |
11, 12 తరగతులకు | లెవల్-4 |
డిగ్రీ ఫస్టియర్ | లెవల్-4, 5 |
డిగ్రీ సెకండియర్ | లెవల్- 5 |
డిగ్రీ ఫైనల్ ఇయర్ | లెవల్-5.5 |
నాలుగేళ్ల డిగ్రీ | లెవల్-6 |
పీజీ డిగ్రీ | లెవల్-6.5 |
ఇంజినీరింగ్ డిగ్రీ | లెవల్-7 |
పీహెచ్‌డీ | లెవల్-8 |
క్రెడిట్స్ నిల్వ ఇలా...
ప్రతీ లెవల్‌లో విద్యార్థి సాధించిన క్రెడిట్స్ అన్నీ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎబీసీ) టెక్నాలజీ ప్లాట్‌ఫాంలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి విద్యా సంస్థ ఈ ప్లాట్‌ఫాం కిందకు వస్తుంది. క్రెడిట్స్ ఆధారంగానే విద్యార్థి స్థాయిని ఎన్‌సీఆర్‌ఎఫ్ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు టెన్త్ తర్వాత ఐటీఐ పాస్ అయిన విద్యార్థి అదనంగా లాంగ్వేజ్ కోర్సు చేస్తే ఇది 12వ క్లాసుకు సమానం అవుతుంది. అతను యూనివర్సిటీలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. అదే విధంగా 5వ స్థాయి విద్యార్థి బ్రిడ్జ్ కోర్సులు అదనంగా చేస్తే అదనపు క్రెడిట్స్ వస్తాయి. అతను నేరుగా 8వ క్లాసు పరీక్షకు హాజరవ్వొచ్చు. విద్యార్థి ఆన్‌లైన్ కోర్సులు చేసినా ఆ క్రెడిట్స్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. క్రెడిట్స్‌ను లెక్కగట్టడానికి ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఇవి అకడమిక్, స్కిల్, అనుభవం ద్వారా పొందే విద్యను బట్టి ఉంటాయి.
ఇవి కూడా క్రెడిట్సే..
అకడమిక్ విద్యే కాదు... క్రీడలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మ్యూజిక్, హెరిటేజ్, ట్రెడిషనల్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రత్యేక కళలకూ క్రెడిట్స్ ఇస్తారు. ఇవి కూడా క్రెడిట్ బ్యాంకులో చేరతాయి. క్రెడిట్ సిస్టమ్‌ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్నారు. కొన్ని క్రెడిట్స్‌ను అన్‌స్కిల్డ్, కొన్ని క్రెడిట్స్‌ను స్కిల్ అని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే మన దేశమూ అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ విధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read:
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) డిసెంబర్-2022/ జూన్-2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ-నెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే పరీక్ష తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని.. ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జూన్ 6, 7, 8 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'టోఫెల్' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!
విదేశాల్లో ఉన్నతవిద్య కోసం వెళ్లాలనుకునే వారిలో 'ఇంగ్లిష్' నైపుణ్యాలను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..