అన్వేషించండి

TS EAPCET: ముగిసిన తెలంగాణ ఎప్‌సెట్‌ పరీక్షలు, 94 శాతం హాజరు నమోదు - ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7న ప్రారంభమైన టీఎస్ ఎప్‌సెట్‌ పరీక్షలు మే 11తో ముగిశాయి. పరీక్షలకు మొత్తం 3.32 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

TS EAPCET 2024: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7న ప్రారంభమైన టీఎస్ ఎప్‌సెట్‌ పరీక్షలు మే 11తో ముగిశాయి. ఇందులో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు; మే 9 - 11 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5 రోజులపాటు నిర్వహించిన పరీక్షలకు 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. అందులో 3.32 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తంగా 94 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు నిర్వహించిన ఈ పరీక్షలకు రెండురోజుల్లోనూ 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల తొలిరోజైన మే 7న మొదటి సెషన్‌కు 90.41 శాతం మంది, రెండో సెషన్‌కు 91.24 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా 33,500 మందికి గాను 30,288 మంది మొదటి సెషన్‌లో; 33,505 మందికి గాను 30,571 మంది రెండో సెషన్‌లో పరీక్ష రాశారు. ఇక మే 8న నిర్వహించిన పరీక్షకు 91.67% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 33,427 మందికిగాను 30,641 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తంగా ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకోగా.. 91,500 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది  మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా... వారిలో 2,40,617 మంది పరీక్షలు రాశారు.

మే 12న ఇంజినీరింగ్ కీ..
ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని మే 12 ఉదయం విడుదల చేయనున్నారు. విద్యార్థులు కీ తో పాటు రెస్పాన్స్ షీట్, ప్రశ్నపత్రాన్ని ఎప్సెట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే మే 14 ఉదయం 10 గంటల వరకు పంపుకోవచ్చు.   

మే 25న ఫలితాల వెల్లడి..
ఎప్‌సెట్‌ ఫలితాలు మే 25న విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మే 25న కుదరకపోతే మే 27న ఫలితాలు విడుదల చేసేందుకు జేఎన్‌టీయూ అధికారుల సన్నాహకాలు చేస్తున్నారు.

అగ్రి, ఫార్మా ప్రిలిమినరి 'కీ' విడుదల..
తెలంగాణలో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో నిర్వహించిన ఎప్‌సెట్‌ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూహెచ్ మే 11న విడుదల చేసింది. ఈ మేరకు ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీ విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు మే 11 నుంచి 13 వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 13న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలు తెలిపవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఇక మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి 'కీ' మే 12న విడుదల చేయనున్నారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget