TSMS Inter Admissions: తెలంగాణ 'మోడల్ స్కూల్స్'లో ఇంటర్ ప్రవేశాల దరఖాస్తుకు మే 25 వరకు అవకాశం, ఎంపిక ఇలా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ మే 10న వెలువడిన సంగతి తెలిసిందే. విద్యార్థులు మే 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
TS Model Schools Inter Admissions: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ మే 10న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభమైంది. పదోతరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ ఇంగ్లిష్ మీడియం గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున మొత్తం 160 సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. రిజర్వేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ పాఠశాలల్లో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ అందుబాటులో ఉంటాయి.
వివరాలు...
* ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు -2024 (TS Model Schools Inter Admissions)
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.
మోడల్ స్కూల్స్ సంఖ్య: 194.
సీట్ల సంఖ్య: 31,040 (ఒక్కోగ్రూపులో 40 చొప్పున, ఒక్కో పాఠశాలలో మొత్తం 160 సీట్లు).
సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం (6 సీట్లు), ఎస్టీలకు 10 శాతం (4 సీట్లు), బీసీలకు 29 శాతం (12 సీట్లు), ఓసీలకు 36 శాతం (14 సీట్లు), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం (4 సీట్లు) కేటాయిస్తారు. ఇందులో 3 శాతం సీట్లు వికలాంగులకు కేటాయిస్తారు. అదేవిధంగా బాలికలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తారు. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం కోటాను అమలుచేస్తారు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జీపీఏ ఆధారంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా వారివారి మోడల్ స్కూల్ పరిధిలోని నివాసితులై ఉండాలి. ఆయా మండల పరిధిలోని 9, 10 తరగతులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశ విధానం: రిజర్వేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ప్రవేశం ఇలా..
➥ ప్రవేశాలు కోరే విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://www.tsmodelschools.com/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Click Here for Intermediate Admission into model schools for the Academic year 2024-25' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆన్‌లైన్ దరఖాస్తులో కోరిన అన్ని వివరాలను నమోదుచేయాలి. వీటితోపాటు విద్యా్ర్థులు తమ సంతకం, ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
➥ దరఖాస్తు పూరించాక ఒకసారి నిశితంగా పరిశీలించుకోవాలి. ఆ తర్వాత 'SUBMIT' బటన్ మీద క్లిక్ చేయాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
➥ దరఖాస్తుకు విద్యార్థులు తమ పదోతరగతి మార్కుల షీటు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జతచేసి సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
➥ విద్యార్థులు తప్పనిసరిగా వారివారి మోడల్ స్కూల్ పరిధిలోని నివాసితులై ఉండాలి. ఆయా మండల పరిధిలోని 9, 10 తరగతులు పూర్తిచేసి ఉండాలి.
➥ వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా ఎంపికజాబితాలను విడుదల చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.05.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.05.2024.
➥ స్కూల్క్‌వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా వెల్లడి: 26.05.2024.
➥ మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 27.05.2024.
➥ ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన: 29.05.2024 - 31.05.2024.
➥ తరగతుల ప్రారంభం: 01.06.2024.
ALSO READ:
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్' ప్రవేశాల దరఖాస్తుకు మే 22 వరకు అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పతోతరగతి అర్హత ఉన్న విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మార్చి 22న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..