By: ABP Desam | Updated at : 10 Aug 2021 01:16 PM (IST)
రేపే తెలంగాణ పీజీఈసెట్
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పీజీఈసెట్) పరీక్షలు రేపటి నుంచి (ఆగస్టు 11) ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 14 వరకు జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 23,187 మంది హాజరుకానున్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 17,864 మంది, వరంగల్‌లో 5,323 మంది పరీక్ష రాయనున్నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
రెండు సెషన్లలో..
పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11, 12, 13, 14 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మార్నింగ్ సెషన్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం సెషన్ 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. మొదటి సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద రిపోర్టింగ్ టైమ్ 8.30గా ఉంది. ఇక మధ్యాహ్నం సెషన్‌కు 12.30గా నిర్దేశించారు.
Also Read: NEET 2021 Registration: విద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
19 పేపర్లలో పరీక్ష..
పీజీఈసెట్ పరీక్ష ద్వారా గేట్ జీప్యాట్ విద్యార్థులకు ఎంఈ / ఎంటెక్ / ఎంఫార్మా / గ్రాడ్యుయేట్ లెవల్/ ఎంఆర్క్ ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పీజీఈసెట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షను మొత్తం 19 (ఫార్మసీతో కలిపి) పేపర్లలో నిర్వహించనుంది. అభ్యర్థులు బీటెక్‌లో చదివిన బ్రాంచ్ ఆధారంగా సంబంధిత పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తోంది. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ సహా మాక్ టెస్టులు హాజరవ్వడానికి pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
పరీక్ష షెడ్యూల్ ఇదే..
Inter Exam Fee: తెలంగాణలో ఇంటర్ తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్
UGC NET 2022: యూజీసీ నెట్ షెడ్యూల్ విడుదల- ఏ సబ్జెక్ట్ పరీక్ష ఎప్పుడో తెలుసుకోండిలా
Caste Awareness Course: ఆ ఐఐటీలో ఇకపై క్యాస్ట్ అవేర్నెస్ కోర్స్ తప్పనిసరి! ఎప్పటి నుంచంటే?
CBSE 10th Result 2022: బీ అలర్ట్ - నేడు సీబీఎస్ఈ 10వ తరగతి టర్మ్ 2 ఫలితాలు విడుదల
Bill Gates Resume: బిల్‌గేట్స్ రెజ్యూమ్ చూశారా- ఆయన చేసిన కోర్సులు చూస్తే షాక్ అవుతారు
Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్
Bandi Vs KCR : తెలంగాణలో "లెక్క"లు మారుతాయా? ఎవరి అవినీతి ఎవరు వెలికి తీస్తారు?
Happy Birthday MS Dhoni: తుఫాన్ ఎదురొచ్చినా తలొంచని తత్వం - మహేంద్రుడి సొంతం!
Cooking Oil Prices: గుడ్ న్యూస్! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!