అన్వేషించండి

తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు- అక్కడ ఏకంగా లక్షన్నరకు పెంపు!

ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ రూ.లక్ష దాటింది.

తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ రూ.లక్ష దాటింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ.45 వేలకు పెరిగింది. ఎంజీఐటీ కాలేజీలో రూ.1.60 లక్షలు, సీవీఆర్ లో రూ.1.50 లక్షకు చేరింది. సీబీఐటీ, వర్ధమాన్, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా ఉంది. ఇక ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ. 57 వేలుగా ఖరారు చేసింది. కాగా కొత్త ఇంజినీరింగ్ ఫీజులు మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

ఇంజినీరింగ్ ఫీజుల విషయమై సెప్టెంబ‌రు 24న విచారణ జరిపిన టీఏఎఫ్ఆర్సీ ‌ఫీజులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్ కళాశాలలు ఇందుకు అంగీకరించాయి. అయితే 20 కళాశాలలు మాత్రం ఈ ఫీజులను అంగీకరించలేదు. వీటిలో సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్‌, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, అనురాగ్, విద్యాజ్యోతి, కేఎంఐటీ, మల్లారెడ్డి, సీఎంఆర్ గ్రూపుల్లోని మరికొన్ని కళాశాలలున్నాయి. దీంతో కమిటీ మరోసారి వారి అభ్యంతరాలను వినాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కళాశాలల ప్రతినిధులతో అక్టోబ‌రు 3న సుదీర్ఘంగా చర్చించింది. కళాశాలల విజ్ఞప్తులను, పత్రాలను పరిశీలించింది. అనంతరం ఆయా కళాశాలలు కొంత మొత్తాన్ని పెంచుకునేందుకు కమిటీ అంగీకరించింది. ఎట్టకేలకు 159 ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన ఫీజుల వివరాలను ప్రభుత్వం ఖరారు చేసింది.

ఎంజీఐటీ టాప్..
ఈసారి అత్యధిక ఫీజు ఎంజీఐటీకి రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా.. అత్యల్ప ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించారు. ఇక సీబీఐటీకి పాత ఫీజు రూ.1.34 లక్షలు ఉండగా, గత జులైలో రూ.1.73 లక్షలుగా కమిటీ ఖరారు చేసింది. తిరిగి గత నెలలో విచారణ జరిపి దాన్ని రూ.1.12 లక్షలకు కుదించింది. తాజాగా దాన్ని రూ.1.40 లక్షలకుపైగా పెంచింది. 


ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులు ఇలా..
బీటెక్, ఎంటెక్ కోర్సులతో పాటు.. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ఫీజులు కూడా పెంచింది ప్రభుత్వం. కనీస వార్షిక రుసుముగా రూ. 27 ఖరారు చేసింది. పెరిగిన ధరలు 2022-23, 2023-24, 2024-25 అకాడమిక్ ఇయర్స్‌లో అమల్లో ఉంటాయి.

ఫీజు ఖరారు చేసిన కాలేజీల జాబితా ఇలా..:


:: ఇవీ చదవండి ::

విద్యార్థులకు గుడ్ న్యూస్, డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూ కీలక నిర్ణయం!
జేఎన్‌టీయూ-హైదరాబాద్ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త వినిపించింది. విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థులను వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయడానికి క్రెడిట్ ప్రమాణాలను సడలించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'నీట్‌' పీజీ కటాఫ్‌ మార్కులు తగ్గించిన కేంద్రం, కొత్త కటాఫ్ ఇదే!
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్‌-2022 పీజీ మెడికల్ అర్హత కటాఫ్‌ స్కోర్‌ను 25.714 పర్సంటైల్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 24.286 పర్సంటైల్‌ 174 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చెందిన వారికి 14.286 పర్సంటైల్‌ 138 మార్కులు, దివ్యాంగులకు 19.286 పర్సంటైల్‌ 157 మార్కులు సాధించిన విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లొ సీట్లు మిగిలిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కటాఫ్ మార్కులను తగ్గించింది. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
Embed widget