అన్వేషించండి

NEET: 'నీట్‌'పై సుప్రీం మెట్లెక్కిన తమిళనాడు సర్కారు, కారణమిదే!

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే NEET చట్టబద్ధతను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. నీట్‌పై పిటిషన్ దాఖలు చేసింది.

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)పై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశంలో వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక ప్రవేశమార్గం నీట్‌ అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం, ప్రాథమిక సమానత్వ హక్కును ఉల్లంఘించడం, ఫెడరలిజం సూత్రాలను విస్మరించడంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 131 ప్రకారం వేసిన ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. 'నీట్‌లో సాధించిన మార్కులే అన్ని వైద్య, అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికం అని చెప్పడం భారత రాజ్యాంగంలోని నిబంధనలు, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ఏకపక్షంగా ఉల్లంఘించడమే' అని సుప్రీంకోర్టు ప్రకటించాలని పిటిషన్‌లో తమిళనాడు ప్రభుత్వం కోరింది.

'నీట్‌ పరీక్షను ప్రవేశపెట్టడం, కొనసాగించడం వల్ల తమిళనాడులోని విద్యార్థులు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తమిళనాడు రాష్ట్ర విద్యా మండలి అనుబంధ పాఠశాలల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం లపడడం వలన' సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. 'నీట్‌తో వైద్య కళాశాలల్లోని ప్రభుత్వ సీట్లలో విద్యార్థులను చేర్చుకునే రాష్ట్రాల అధికారాన్ని హరించడం వల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంది. విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. దీనిపై చట్టాలను రూపొందించడం రాష్ట్రాల హక్కు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం విద్యను నియంత్రించే హక్కు రాష్ట్రాలకు ఉంది. ప్రైవేట్‌, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ కళాశాలలు అనే తేడా లేకుండా అన్ని వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నీట్‌ను ప్రవేశపెట్టడం సమాఖ్య నిర్మాణానికి, విద్యకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని ఉల్లంఘించడమే' అని పిటిషన్‌ వాదించింది.

అలాగే, నీట్‌ వల్ల రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసించే, స్టేట్‌ బోర్డ్‌ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడింది. నీట్‌ పరీక్ష సిబిఎస్‌ఇ/ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌పై ఆధారపడినందున ఈ విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరవుతున్నప్పుడు విపరీతమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్నారని, నీట్‌ అనేది తమిళనాడు స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సెట్‌ చేసిన సిలబస్‌కు భిన్నంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.

అదేవిధంగా ఆర్థిక వనరుల కొరత, కోచింగ్‌ తరగతులకు హాజరయ్యే అవకాశాలు లేకపోవడం, సంవత్సరం వ్యవధి తీసుకొని పరీక్షను మళ్లీ రాయలేకపోవడం వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా పైన పేర్కొన్న విద్యార్థులు ప్రతికూలంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసింది. 'అందువల్ల, ఈ విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ, ఎక్కువ అవకాశాలు ఉన్న అర్బన్‌, సెమీ-అర్బన్‌ విద్యార్థులతో సమానంగా పోటీ పడలేరు' అని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

Also Read:

GST Council: విద్యార్థులకు గుడ్ న్యూస్, తగ్గనున్న పరీక్షల ఫీజులు!
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించే 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ'ని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అలాగే పెన్సిళ్లు, షార్పనర్‌లపైనా లెవీని తగ్గించాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో 49వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, ఎంటెక్‌ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
 పీజీ లేకున్నా పీహెచ్‌డీ‌ల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్‌ విద్యార్థులు కూడా రిసెర్చ్‌ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్‌ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్‌ బీటెక్‌ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. గతంలో బీటెక్‌ విద్యార్థులు పీహెచ్‌డీ చేయాలంటే.. ఎంటెక్‌ తప్పనిసరి. ఇప్పుడు వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget