అన్వేషించండి

AP IIIT Notification: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలివే..

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఆర్జీయూకేటీ (రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన.. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ రేపు (ఆగస్టు 20) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. గడువు సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆర్జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.rgukt.in/ ను సంప్రదించవచ్చు. ఇందులో ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్లు ఉన్నాయి. 

Also Read: EAPCET Exams: నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్

సెప్టెంబర్ 26న పరీక్ష.. 
ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. రూ.1000 ఆలస్య రుసముతో సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రాథమిక కీ సెప్టెంబర్ 26న విడుదల కానుంది. కీపై అభ్యంతరాలను సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తారు. తుది కీని అక్టోబర్ 2న విడుదల చేస్తారు. 

దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150, బీసీ అభ్యర్థులు రూ.250, ఓసీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. మ్యాథమెటిక్స్ విభాగానికి 40 మార్కులు, ఫిజకల్ సైన్సెస్ విభాగానికి 40 మార్కులు, బయోలాజికల్ సైన్సెస్ విభాగానికి 20 మార్కులు కేటాయించారు. 

మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్..
సాధారణంగా ఏటా టెన్త్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల వెల్లడించారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...

Also Read: Schools Open: ఇప్పటికిప్పుడు స్కూల్స్ తెరిస్తే మీ పిల్లలని పంపుతారా ?

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget