అన్వేషించండి

EAPCET Exams: నేటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు.. కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం 120 కేంద్రాలను కేటాయించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం  నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)  పరీక్షలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి.  ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు నేటి నుంచి ఆగస్టు 20, 23, 24, 25 తేదీల్లో.. ఫార్మసీ, అగ్రికల్చర్‌ అభ్యర్థులకు సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఒక్కో కేంద్రంలో 200 నుంచి 250 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఈఏపీసెట్‌ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు నిర్ధేశించిన సమయం కంటే కనీసం రెండున్నర గంటలు ముందుగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 

మొత్తం 120 పరీక్ష కేంద్రాలు..
ఈఏపీసెట్ పరీక్షల కోసం ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి మొత్తం 120 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గుంటూరు నగరం సహా ఇతర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ (కాకినాడ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.  ఈ రోజు పరీక్షకు ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్ష కోసం మొత్తం 15 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక అగ్రికల్చరల్‌, ఫార్మసీ విభాగాల పరీక్ష కోసం దాదాపు 3 వేల మంది హాజరుకానున్నారు.

ప్రాథమిక 'కీ' ఆగస్టు 25న..
ఇంజనీరింగ్‌ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 25న.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రాథమిక 'కీ'ని సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 2,59,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 1,75,796 మంది ఇంజనీరింగ్‌ను.. 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. 717 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ రెండింటినీ ఎంచుకున్నారని వివరించారు. 
కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్..
కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు పరీక్షలకు అనుమతించబోమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. వీరికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి.. ఈఏపీసెట్‌ పరీక్షను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని వెల్లడించారు. 

Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...

Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్ విడుదల..

టాప్ హెడ్ లైన్స్

Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget