Free Training: రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ, వీరు అర్హులు!
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని యువతీ, యువకులకు ఎలక్ట్రిక్ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా 6 నెలలు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
Reddys foundation Free Training: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని యువతీ, యువకులకు ఎలక్ట్రిక్ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా 6 నెలలు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీనియర్ మేనేజర్ రాఘవేందర్‌రావు తెలిపారు. ఐటీఐ, డిప్లొమా (ఎలక్ట్రికల్/మెకానికల్/ఆటోమొబైల్) అర్హత ఉన్నవారు ఈ శిక్షణకు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జనవరి 18 12 లోపు సంబంధిత ఫోన్ నంబర్ల ద్వారా తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
* ఉచిత ఉపాధి శిక్షణ
సంస్థ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్
శిక్షణాంశాలు: ఎలక్ట్రిక్ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా
అర్హత: ఐటీఐ, డిప్లొమా (ఎలక్ట్రికల్/మెకానికల్/ఆటోమొబైల్)
వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 8019050334, 8247891195.
పేర్ల నమోదుకు చివరితేది: 18.01.2024.
ALSO READ:
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏవియేషన్ కోర్సు - అర్హతలు, ఎంపిక, శిక్షణ వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో 'ఏవియేషన్ స్కూల్' ఏర్పాటైంది. దీనిద్వారా విమానాల నిర్వహణ ఇంజినీరింగ్(AME -Aircraft Maintenance Engineering) కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో విమానయాన సంస్థల్లో పెరుగుతున్న మానవ వనరులకు అవసరాలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సుకు డీజీసీఏతోపాటు ఐరోపా విమానయాన భద్రతా ఏజెన్సీ (యాసా) అనుమతులు కూడా ఉన్నాయి. లుగేళ్ల ఇంటిగ్రేటెట్ ఇంజినీరింగ్ కోర్సును ఈ జూన్ నుంచే ప్రారంభించనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. తెలంగాణ ఎంసెట్, జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్ష ద్వారా మొత్తం 200 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లోని విమానయాన సంస్థల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాసియాలోనే ఇది తొలి 'ఏవియేషన్ స్కూల్'గా నిలవనుంది. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH)-పార్ట్ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు (MTECH, MBA Programmes) అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికెట్ అవసరమవుతాయి. ప్రవేశపరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి స్కాలర్‌షిప్ లభించదు.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..