Pearl Academy: పెరల్ అకాడమీలో డిజైన్ & మేనేజ్‌మెంట్ కోర్సులు, ప్రవేశాలు ఇలా
Pearl Academy Admissions: పెరల్ అకాడమీ 2024-25 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
Pearl Academy Admission: దేశంలోని పలు క్యాంపస్‌లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం పెరల్ అకాడమీ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల వివరాలు..
* ప్రవేశాలు - జనవరి 2024 సైకిల్
క్యాంపస్‌లు: బెంగళూరు, దక్షిణ-ఢిల్లీ, తూర్పు-ఢిల్లీ, జైపూర్, ముంబయి.
➥ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డీఈఎస్)
➥ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)
➥ మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎం.డీఈఎస్)
➥ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)
కోర్సుల వ్యవధి: 11 నెలలు.
విభాగాలు: ఫ్యాషన్, బిజినెస్, ప్రొడక్ట్ డిజైన్, ఇంటీరియర్స్, కమ్యూనికేషన్ డిజైన్, గేమింగ్, ఫిల్మ్.
అర్హత: సంబంధిత కోర్సును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.01.2024.
➥ అడ్మిట్‌కార్డుల విడుదల: 24.01.2024.
➥ రాతపరీక్ష (ఆఫ్‌లైన్) తేది: 27-28.01.2024 (9:00 AM – 11:00 AM)
➥ పర్సనల్ ఇంటర్వ్యూ తేది: 27-28.01.2024 (11:30 AM – 5:00 PM)
➥ పరీక్ష తేదీ: 27, 28 జనవరి 2024
విద్యార్థులకు స్కాలర్‌షిప్స్..
ప్రవేశాలతోపాటు ప్రతిభగల విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను పెరల్ యూనివర్సిటీ అందిస్తోంది. ఈ విద్యా సంస్థ కొత్తగా ఓ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ‘హూ ఇస్ నెక్స్ట్(Who’s Next)’ పేరుతో ఈ ప్రోగ్రామ్ కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 100 శాతం ఫీజు మినహాయింపు అందిస్తోంది. ఎంపిక పరీక్ష ఆధారంగా 100 మంది విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తారు. మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లతో పాటు పెరల్ అకాడమీ మరిన్ని స్కాలర్‌షిప్‌లతో అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. జనవరి సైకిల్‌కు సంబంధించి షెడ్యూలు వెల్లడించాల్సి ఉంది.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWR) ప్రవేశాలు కల్పించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్ కూడా ఉచితంగా కల్పిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్..
తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. విద్యార్థులు డిసెంబరు 18 నుంచి జనవరి 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..