అన్వేషించండి

TSWR Inter Admissions: తెలంగాణ ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు, ఎంపిక ఇలా

TSWR: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

TSWR Inter Admissions: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWR) ప్రవేశాలు కల్పించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్‌ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్‌ కూడా ఉచితంగా కల్పిస్తారు. 

వివరాలు..

* ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు

గ్రూప్‌: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.

సీట్ల సంఖ్య: 3,680. ఇందులో బాలురకు 1,680 సీట్లు, బాలికలకు 2,000 సీట్లు కేటాయించారు.

రిజర్వేషన్: ఎస్సీలకు 75%, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2%, ఎస్టీలకు 6%, బీసీలకు 12%, మైనారిటీలకు 3%, ఓసీ/ ఈబీసీలకు 2% సీట్లు కేటాయించారు. ఎస్సీ-30, ఎస్సీ (కన్వర్టెడ్ క్రిస్టియన్స్)-01, ఎస్టీ-02, బీసీ-05, మైనార్టీస్-01, ఓసీ/ఈడబ్ల్యూఎస్-01 సీట్లు కేటాయిస్తారు.

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలకు మించకూడదు.

వయోపరిమితి: 31.08.2024 నాటికి 17 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఎంపీసీ/ బైపీసీ గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్‌-1, 2); ఎంఈసీ/ సీఈసీ గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్‌-1), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ప్రవేశ పరీక్ష విధానం..

➥ మొత్తం 160 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష-1 నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకు ఒకమార్కుకాగా.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ పరీక్ష నిర్వహిస్తారు.  

➥ మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష-2 నిర్వహిస్తారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వారికి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్-1 రాసినవారిలో 1 : 5 నిష్పత్తిలో స్క్రీనింగ్ టెస్ట్-2కు ఎంపికచేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ పరీక్ష నిర్వహిస్తారు.  
  
ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.01.2024.

➥ హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ తేదీలు: 25.01.2024 నుంచి 03.02.2024 వరకు.

➥ స్క్రీనింగ్ పరీక్షతేది: 04.02.2024.

Notification

Online Application

Website

ALSO READ:

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, ఎంపిక ఇలా
తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. విద్యార్థులు డిసెంబరు 18 నుంచి జనవరి 6 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
ప్రవేశ వివరాలు, విధానం గురించి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget