JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే
JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2024 పరీక్ష షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబరు 23న ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
![JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే NTA has released JEE Advanced 2024 examination schedule exam will be held on 26 May 2024 JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/a2ee073db45f6bdce388262a7b62c8781700802878138522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
JEE Advanced 2024 Exam Schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్ష షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబరు 23న ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఏప్రిల్ 21 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అయితే మే 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (JEE Advanced 2024 Admit Card) మే 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. మే 26న పరీక్ష నిర్వహించి జూన్ 2న ప్రాథమిక కీ విడుల చేసి, జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 9న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు.
JEE (Advanced) 2024 : Syllabus
జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు నవంబర్ 30..
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు ప్రకారం నవంబరు నవంబరు 2న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా నవంబర్ 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
జేఈఈ మెయిన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
JEE Advanced 2024 ముఖ్యమైన తేదీలివే..
➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.04.2024 (10:00 IST)
➥ JEE (Advanced) 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 30.04.2024 (17:00 IST)
➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.05.2024 (17:00 IST)
➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 17.05.2024 (10:00 IST) - 26.05.2024 (14:30 IST)
➥ పీడబ్ల్యూడీ అభ్యర్థుల ద్వారా స్క్రైబ్ ఎంపిక (40% కంటే తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు రాయడంలో ఇబ్బంది ఉన్నవారు): 25.05.2024.
➥ JEE (Advanced) 2024 పరీక్ష తేది: 26.05.2024 (శనివారం)
⫸ పేపర్-1: 09:00-12:00 IST
⫸ పేపర్-2: 14:30-17:30 IST
➥ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో: 31.05.2024 (17:00 IST) నుండి
➥ JEE (Advanced) 2024 ప్రొవిజినల్ ఆన్సర్ కీ వెల్లడి: 02.06.2024 (10:00 IST)
➥ JEE (Advanced) 2024 ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.06.2024 (10:00 IST) - 03.06.2024 (17:00 IST)
➥ JEE (Advanced) 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ వెల్లడి: 09.06.2024 (10:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09.06.2024 (10:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 10.06.2024 (17:00 IST)
➥ జాయింట్ సీట్ అల్లొకేషన్ (JoSAA) 2024 ప్రక్రియ ప్రారంభం: 10.06.2024 (17:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 పరీక్ష తేది: 12.06.2024 (09:00 IST - 12:00 IST)
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఫలితాల వెల్లడి: 15.06.2024 (17:00 IST)
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)