అన్వేషించండి

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు ప్రకారం నవంబరు 1న ప్రారంభంకావాల్సి ఉండగా... నవంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ద్వారా నవంబర్‌ 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 

ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్‌, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.

వివరాలు...

* జేఈఈ మెయిన్ 2024 (జనవరి సెషన్)

అర్హతలు..

➥ బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తోపాట కెమిస్ట్రీ/బయాలజీ/బయోటెక్నాలజీ/ సాంకేతిక వృత్తిపరమైన సబ్జెక్టుల్లో ఏదైనా  కలిగి ఉండాలి. 

➥ బీఆర్క్ కోర్సలకు ప్రవేశాలు కోరేవారు ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆప్షనల్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.  (లేదా) పదో తరగతితోపాటు మూడేళ్ల డిప్లొమా (మ్యాథమెటిక్స్) ఉండాలి.

➥ ఇక బీప్లానింగ్‌కు తప్పనిసరి సబ్జెక్టుతోపాటు గణితం కూడా ఉండాలి.

➥ ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం ఉండాాలి.

పరీక్ష ఫీజు వివరాలు..

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

పరీక్ష విధానం..

➥పేపర్‌-1(బీటెక్, బీఈ) ఇలా
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు.  సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.  డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.

➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది.  మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు.  బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ రెండు పేపర్లకు మూడున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. 

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

దరఖాస్తుల సమర్పణ ఇలా..

స్టెప్-1: ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబరు, పేరు వంటి ప్రాథమిక వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు కూడా పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత, ప్రత్యేకమైన JEE మెయిన్ 2024 అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. తదుపరి లాగ్-ఇన్‌ల కోసం సేవ్ చేయాలి

స్టెప్-2: రెండో దశలో అభ్యర్థులు అదే అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. అవసరమైన అన్ని వివరాలను సమర్పించాలి.

స్టెప్-3: అన్ని సంబంధిత డాక్యుమెంట్‌లను పేర్కొన్న ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. అధికారిక నోటిఫికేషన్‌లో స్పెసిఫికేషన్‌లు వివరంగా ఉంటాయి.

స్టెప్-4: NTA JEE మెయిన్ 2024 దరఖాస్తు కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ లేదా ఏదైనా ఇతర ఎంపిక ద్వారా చెల్లింపు చేయవచ్చు.

స్టెప్-5: చెల్లింపు చేసిన తర్వాత, అభ్యర్థులు తదుపరి ఉపయోగం కోసం సమర్పించిన దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ తీసుకోవాలి.

దరఖాస్తు సమయంలో అవసరమయ్యే పత్రాలు..

➥ దరఖాస్తుదారు ఫోటో స్కాన్ చేసిన కాపీ

➥ దరఖాస్తుదారు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ

➥ కేటగిరీ సర్టిఫికెట్లు(వర్తిస్తే)

➥ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ మొదలైన ఫోటో గుర్తింపు రుజువు

➥ 10వ తరగతి మార్కు షీట్

➥ ఇంటర్మీడియట్  మార్క్ షీట్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2023

➥ దరఖాస్తుకు చివరితేదీ: 30.11.2023

➥ ఫీజు చెల్లింపునకు చివరితేదీ: 30.11.2023 (రాత్రి 11.50 గంటల వరకు)

➥ పరీక్ష కేంద్రాల (నగరాలు) ప్రకటన: 2024, జనవరి రెండో వారంలో

➥ అడ్మిట్‌కార్డులు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు

➥ ఆన్‌లైన్‌ పరీక్షలు: 24.01.2024 నుంచి 01.02.2024 వరకు

➥ పరీక్ష ఫలితాలు: 12.02.2024.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

తెలంగాణలో:  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌.

ఏపీలో: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపం పరే, ప్రొద్దటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

Notification

 Information Bulletin 

Online Registartion

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget