NEET UG 2021: విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీలో సవరణలకు అవకాశం.. ఇవి చేయకపోతే ఫలితాలు కూడా రావు
NEET UG Phase 2 Registration 2021: నీట్ యూజీ ఫేజ్ 2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NTA) వెల్లడించింది. అక్టోబర్ 10వ తేదీ వరకు అప్లికేషన్ విండో అందుబాటులో ఉంటుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ ) -2021 యూజీ ఫేజ్ 2 (second phase) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిన్నటి (అక్టోబర్ 1) నుంచి ప్రారంభమైంది. నీట్ ఫేజ్ 2 అప్లికేషన్ విండో అక్టోబర్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని జాతీయ దర్యాప్తు సంస్థ (NTA) వెల్లడించింది. ఈ నెల 10లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. నీట్ యూజీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎన్టీఏ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం NTA, నీట్ అధికారిక వెబ్‌సైట్లను https://neet.nta.nic.in/, www.nta.ac.in ను సంప్రదించవచ్చు. నీట్ యూజీ ప్రక్రియపై సందేహాలు ఉంటే neet@nta.ac.in అడ్రస్‌కు ఈమెయిల్ చేయవచ్చు.
Also Read: నీట్ PG ఫలితాలు ఖరారు.. త్వరలోనే లింక్ అందుబాటులోకి.. చెక్ చేసుకోవడం ఇలా..
సవరణలకు అవకాశం..
నీట్ యూజీ - 2021 మొదటి దశలో (ఫేజ్ 1) అభ్యర్థులు తమ వివరాలను అందించి రిజిస్టర్ చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లించారు. ఫేజ్ 2లో భాగంగా అభ్యర్థులు తమ 11, 12 ( XI, XII) తరగతులకు సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది. అలాగే ఫేజ్ 1లో అందించిన జెండర్, నేషనాలటీ, ఈమెయిల్ అడ్రస్, కేటగిరీ, సబ్ కేటగిరీ తదితర వివరాలను సవరించుకునే (ఎడిట్) సదుపాయాన్ని ఎన్టీఏ కల్పించింది. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదని ఎన్టీఏ తెలిపింది. ఫేజ్ 2 రిజిస్ట్రేషన్లను పూర్తి చేయని విద్యార్థుల అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థి నీట్ ఫలితాలను వెల్లడించబోమని పేర్కొంది.
నీట్ ఫేజ్ 2 అప్లికేషన్లలో అందించాల్సిన వివరాలు..
1. నివాస ప్రదేశం (Place of Residence)
2. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ (Mode of preparation)
3. 11, 12 తరగతులను ఏ సంవత్సరంలో పూర్తి చేశారు, పాఠశాల పేరు, మార్కులు తదితర వివరాలు.
4. తల్లిదండ్రుల ఆదాయ వివరాలు
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..