X

AP Group 1 : ఏపీ గ్రూప్ -1 అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. మెయిన్ పేపర్లు మాన్యువల్ పద్దతిలో దిద్ది ఫలితాలు ప్రకటించాలన్న హైకోర్టు !

గ్రూప్ వన్ ఇంటర్యూలపై స్టే ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు మెయిన్స్ ఫలితాలను పక్కన పెట్టింది. కొత్తగా మాన్యువల్ పద్దతిలో మూల్యంకనం చేయాలని ఆదేశించింది. మూడు నెలల్లోఫలితాల్లో ప్రకటించాలని స్పష్టం చేసింది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల పత్రాలను మళ్లీ మాన్యూవల్‌గా మూల్యంకనం చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే జారీ చేసిన మెయిన్ ఫలితాలను పక్కన పెట్టినట్లయింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2018లో ఎపీపీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు జరిగాయి. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పరీక్షల ఫలితాలను నిలిపివేశారు. ఆ తర్వాత మార్కుల మూల్యంకన పద్దతిలో మార్పులు చేశారు. మాన్యువల్ పద్దతిని తీసేసి  టెక్నికల్ పద్దతిలో మ్యూల్యంకనం చేసి ఫలితాలను ప్రకటించారు. 

Also Read : ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం..

అయితే ఏపీపీఎస్సీ అక్రమాలకు పాల్పడిందని పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు ఇంటర్యూలను నిలిపివేసింది.  గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది . మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేశారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది.  డిజిటల్ వాల్యూయేషన్ అనేది నోటిఫికేషన్‌లో లేదని తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారని .. దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. 

Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..

ఈ అంశంపై   జరుగుతున్న విచారణలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన పని తనను చేసుకోనివ్వలేదని ఆఫీసుకు కూడా రానివ్వలేదని చాంబర్‌తో పాటు అటెండర్ ను కూడా ఇవ్వలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన విధులను ఆటంక పరిచారని.. నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారని ఆ నిర్ణయాలేవీ తన ఆమోదంతో జరగలేదని స్పష్టం చేశారు.  

Also Read: ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు.. కేంద్రం కీలక నిర్ణయం..

గ్రూప్స్ లో ర్యాంక్ సాధించలేని కొంతమంది ఇటీవల సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించారు. దీంతో నిజంగానే గ్రూప్స్ మూల్యంకనంలో అక్రమాలు జరిగాయని.. పెద్ద అత్తున అర్హుల్ని తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో  గ్రూప్ వన్ పరీక్షలు రాసిన వారికి కాస్తంత రిలీఫ్ దక్కనుంది. మాన్యూవల్ మూల్యంకనం తర్వాత అసలు ఫలితాలు ప్రకటించి ఇంటర్యూలు నిర్వహించనున్నారు. 

Also Read: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Andhra High Court APPSC Group One Mains Results Canceled APPSC Re-Evaluate

సంబంధిత కథనాలు

Pattabhi :  కుటుంబం కోసం బయటకు వెళ్లా..  త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

Pattabhi : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

AP Ration Dealers Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళన... గోనె సంచులను డీలర్లకే ఇవ్వాలని డిమాండ్

AP Ration Dealers Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళన... గోనె సంచులను డీలర్లకే ఇవ్వాలని డిమాండ్

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

AP HighCourt :  పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ