అన్వేషించండి

Medical College: తెలంగాణలో మరో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్!

జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది.

తెలంగాణకు మరో మూడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో వంద చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మూడు కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వాటి అనుమతి ప్రక్రియ వివిధ దశల్లో ఉందని.. వాటికి కూడా అనుమతి వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అనుమతి వచ్చిన మూడు వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని స్పష్టం చేశాయి.

ఇటీవల సీఎం కేసీఆర్‌ ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాతి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌ జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్‌లో నిధులనూ కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. ఇక కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 చొప్పున మొత్తం 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

జులై నాటికి 9 మెడికల్‌ కాలేజీలు సిద్ధం..
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న 9 మెడికల్‌ కాలేజీలను జూలై నాటికి సిద్ధం చేయాలని ఇటీవల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. కొత్త కాలేజీల పనుల పురోగతిపై ఆయా జిల్లాల మంత్రులు సత్యవతిరాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సమీక్షించారు. జూలై నాటికి తరగతులు ప్రారంభించేందుకు అన్ని వసతులు కల్పించాలని, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు తరుచూ సమీక్షలు నిర్వహించి ఫర్నిచర్‌, ఇతర పరికరాల సరఫరా పనులను వేగవంతం చేయాలని సూచించారు.

Also Read:

NEET 2023: ‘నీట్‌’ దరఖాస్తుకు రెండు రోజులే గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదేరోజు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఏప్రిల్ 6తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నీట్ దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మార్చి 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఏప్రిల్ 3న) సాయంత్రం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్లలో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. 
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget