NIRF Ranking 2024: దేశంలో నెంబర్ వన్ కాలేజీగా హిందూ కాలేజ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ విడుదల
NIRF Rankings 2024 In India: దేశంలో అత్యుత్తమ కాలేజీల జాబితాను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ విడుదల చేసింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీ అగ్ర స్థానంలో నిలిచింది.
National Institutional Ranking Framework NIRF Rankings 2024: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ (NIRF) దేశంలో అత్యుత్తమ కాలేజీల జాబితా విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్ లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీ దేశంలో అత్యుత్తమ కాలేజీగా నిలిచింది. మిరాండ హౌస్ కాలేజీ, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలు ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.
NIRF rankings 2024: Delhi University's Hindu College ranked as the best college in the country followed by Miranda House College and St. Stephen's College.@EduMinOfIndia @dpradhanbjp #NIRFRanking2024 #hinducollege @UnivofDelhi pic.twitter.com/S77NvE4cc6
— SansadTV (@sansad_tv) August 12, 2024
ఎన్ఐఆర్ఎఫ్ తాజా ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీగా నిలిచింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ రెండో స్థానం, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో నిలిచాయి.