అన్వేషించండి

KNRUHS Admissions: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్‌కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభం

KNRUHS: వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులు ఆగస్టు 4 నుంచి 13 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

KNRUHS Counselling Notification: కన్వీనర్ (కాంపీటెంట్) కోటా కింద 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 4 నుంచి 13 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఎంబీబీఎస్ వెబ్‌కౌన్సెలింగ్‌లకు సంబంధించి కాళోజీ వర్సిటీ విడుదల చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితాలో ఎంపికైన విద్యార్థులు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలంగాణలోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 49,143 మంది ర్యాంకులను ప్రకటించింది. 

వివరాలు..

* ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు

నీట్ యూజీ - కటాఫ్ మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్-162 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40 పర్సంటైల్-127 మార్కులు, ఓసీ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు 45 పర్సంటైల్-144 మార్కులుగా నిర్ణయించారు. 

వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, ఓసీ(పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు ఉండాలి. నీట్ యూజీ 2024 ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: భ్యర్థులు రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.3500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2900 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజులకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అదనం. డెబిట్/క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద రూ.12,000 చెల్లించి సీటు కేటాయింపునకు సంబంధించిన 'అలాట్‌మెంట్ లెటర్' పొందాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. ఇక ట్యూషన్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేయనుంది.

రిజర్వేషన్లు: మొత్తం సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం సీట్లను కేటాయించారు. ఇక సమాంతర రిజర్వేషన్ల కింద మహిళలకు మొత్తం సీట్లలో 33 శాతం రిజర్వేషన్ కోటాను అమలుచేయనున్నారు.

దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు..
➥ నీట్ యూజీ 2024 ర్యాంకు కార్డు
➥ పుట్టిన తేదీ ధ్రవీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో
➥ ఇంటర్ మార్కుల మెమో
➥ 9, 10వ తరగతులకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు
➥ ఇంటర్ రెండు సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
➥ తాజాగా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైన కేటగిరీలకు)
➥ మైనార్టీ సర్టిఫికేట్ (ముస్లింలకు)
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2024-25)
➥ తల్లిదండ్రులకు సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్  
➥ NCC, CAP, PMC, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ - ఏ విద్యాసంస్థలో చదవనివారికి (గడచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించిన)
➥ ఆధార్ కార్డు
➥ అభ్యర్థుల పాస్ పోర్ట్ సైజు ఫొటోలు
➥ అభ్యర్థుల సంతకం

సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..
➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tsmedadm2024@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 
➥ నిబంధలనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrugadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 
➥  ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9618240276  ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 
➥  నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

⫸ నోటిఫికేషన్ విడుదల: 03.08.2024.

⫸ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 04.08.2024. (06.00 AM)

⫸ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 13.08.2024. (06.00 PM)

⫸ తుది మెరిట్ జాబితా వెల్లడి: తర్వాత ప్రకటిస్తారు.

⫸ వెబ్ఆప్షన్ల నమోదు తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.

⫸ తరగతులు ప్రారంభ తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

⫸ ప్రవేశ ప్రక్రియ ముగింపు తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notification
Prospectus
Online Registration
Website

ALSO READ: నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల - ఏపీ, తెలంగాణ జాబితాలు వచ్చేశాయ్, కటాఫ్ మార్కుల వివరాలు ఇలా

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget