NEET UG State Ranks: నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల - ఏపీ, తెలంగాణ జాబితాలు వచ్చేశాయ్, కటాఫ్ మార్కుల వివరాలు ఇలా
NEET UG Ranks: నీట్-యూజీ రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదలైంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించగా.. దాన్ని అనుసరించి రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని హెల్త్ యూనివర్సిటీలు విడుదల చేశాయి..
NEET UG 2024 State wise Ranks List: జాతీయ స్థాయిలో నీట్ యూజీ-2024 ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా తాజాగా.. ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాలు ప్రకటించాయి. ఏపీలో మొత్తం 43,788 మంది ర్యాంకులను, తెలంగాణలో మొత్తం 49,143 మంది ర్యాంకులను ఆరోగ్య వర్సిటీలు ప్రకటించాయి.
దేశంలో ఉన్న 710 మెడికల్ కాలేజీల్లో దాదాపు 1.10 లక్షల మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు బీడీఎస్. ఆయుష్, నర్సింగ్ విభాగాల్లో 21 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మర్‌లోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్లనున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు వెలువడటంతో.. ఆయా రాష్ట్రాలు కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాయి. నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు తొలి వారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
NEET UG-2024 - Qualified Candidates appeared from the State of Andhra Pradesh
NEET UG-2024 - Qualified Candidates appeared from the State of Telangana
ఏపీలో కటాఫ్ మార్కుల వివరాలు..
* అన్ రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో - 162
* ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161-127,
* ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూబీడీ) విభాగాల్లో 143-127 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు.
తెలంగాణలో కటాఫ్ మార్కుల వివరాలు..
* అన్ రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో - 162
* బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో - 127
* ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు.
ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్..
* రిజిస్ట్రేషన్ తేదీలు: 14.08.2024 నుంచి 20.08.2024 వరకు.
* సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: 21 - 22..08.2024.
* సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: 23.08.2024.
* సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: 24.08.2024 29.08.2024 వరకు.
రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్..
* రిజిస్ట్రేషన్ తేదీలు: 05.09.2024 నుంచి 10.09.2024 వరకు.
* సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: సెప్టెంబరు 11 - 12..09.2024.
* సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: 13.09.2024.
* సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: 14.09.2024 నుంచి 20.09.2024 వరకు.
మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్..
* రిజిస్ట్రేషన్ తేదీలు: 26.09.2024 నుంచి 02.09.2024 వరకు.
* సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: 03.10.2024 నుంచి 04.10.2024 వరకు.
* సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: 05.10.2024.
* సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: 06.10.2024 - 12.10.2024 వరకు.
తొలుత 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు కౌన్సెలింగ్
నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా మొదట 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎ్‌సఐసీ, ఏఎ్‌ఫఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూలలో ఉండే సీట్లను భర్తీచేస్తారు. కౌన్సెలింగ్ వివరాలు, షెడ్యూల్ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖతో సహా అన్ని రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్ల కోసం నీట్ ర్యాంకర్లు తమ సొంత రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా ర్యాంక్ ఆధారంగా సంబంధిత కౌన్సెలింగ్ అధికారులు మెరిట్ జాబితా తయారు చేస్తారు.