News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 30న మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 30న మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితా, సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అక్టోబరు 1 ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 4న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

నోటిఫికేషన్

వెబ్‌ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..

వెబ్‌ఆప్షన్లకు అర్హత సాధించని అభ్యర్థుల వివరాలు..

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు..
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు అక్టోబరు 1న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 7న సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

➥ ఎంఎస్సీ (నర్సింగ్) నోటిఫికేషన్

ప్రాస్పెక్టస్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

➥ ఎంపీటీ నోటిఫికేషన్

ప్రాస్పెక్టస్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

ALSO READ:

సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2023 నోటిఫికేషన్
సీబీఎస్‌ఈ- సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థినులు లబ్ది పొందుతారు. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ప్రతి సంవత్సరం అందిస్తోంది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి
డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. ఈ మేరకు సెప్టెంబరు 29న ఒక ప్రకటలో తెలిపారు. వయసు 20-28 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. బీసీఏ, బీఎస్సీ(సీఎస్‌), బీటెక్‌(సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ) పూర్తిచేసిన వారికి ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో మూడునెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలనూ కల్పిస్తామని పేర్కొన్నారు. పేర్ల నమోదుకు 80190 50334, 91541 69212 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'స్పాట్ అడ్మిషన్స్' నిర్వహిస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లలితకళా రంగంలో ఎంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో జ్యోతిషం, ఎంఏ (లింగ్విస్టిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి ...

Published at : 01 Oct 2023 11:21 AM (IST) Tags: KNRUHS BSc Nursing Admissions KNRUHS Post BSc Nursing Admissions KNRUHS MSc Nursing Admissions BSc Nursing Weboptions BSc Nursing Registration

ఇవి కూడా చూడండి

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే