By: ABP Desam | Updated at : 30 Sep 2023 11:19 AM (IST)
Edited By: omeprakash
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ స్పాట్ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'స్పాట్ అడ్మిషన్స్' నిర్వహిస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లలితకళా రంగంలో ఎంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో జ్యోతిషం, ఎంఏ (లింగ్విస్టిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
ALSO READ:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్, హరియాణా, మధ్యప్రదేశ్, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని 6 ప్రభుత్వ, 162 ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి దరఖాస్తు గడువు సెప్టెంబరు 16తో ముగియాల్సి ఉండగా.. మొదట సెప్టెంబరు 23 వరకు, ఆ తర్వాత సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్ధులు వెంటనే దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి.
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2023 నోటిఫికేషన్
Single Girl Child Scholarship 2023: సీబీఎస్‌ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థినులు లబ్ది పొందుతారు. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ప్రతి సంవత్సరం అందిస్తోంది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి.
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్ కోర్సుల్లో సరికొత్త సిలబస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి
CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>