NEET UG: నీట్ యూజీ అభ్యర్థుల రాష్ట్ర జాబితా విడుల చేసిన కాళోజీ హెల్త్‌వర్సిటీ!
నీట్ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నీట్ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 3న విడుదలచేసింది.
నీట్ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నీట్ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 3న విడుదలచేసింది. నీట్ ర్యాంకుల వారీగా అభ్యర్థుల వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుండి రాష్ట్రానికి అందింది. నీట్ పరీక్ష దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా చేసిన నమోదు ఆధారంగానే ఈ జాబితా ప్రకటించారు. జామితాలో మొత్తం 44,629 మంది విద్యార్థుల పేర్లు, వారు సాధించిన ర్యాంకును ఉంచారు.
కాళోజీ వర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు యూనివర్సిటీ మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీచేయనున్నారు. అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాతే యూనివర్సిటీ మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కాగా యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏడాది మే 7న జాతీయస్థాయిలో నీట్ అర్హత పరీక్షను నిర్వహించగా, జూన్ 13న జాతీయ స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనరల్ కేటగిరిలో 137 మార్కులు, దివ్యాంగులకు 121, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరి విద్యార్థులకు 107 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించి ర్యాంకులు ప్రకటించారు.
ALSO READ:
డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో 'జాబ్' కోర్సులకే డిమాండ్, అత్యధికంగా భర్తీ అయిన సీట్లు అవే!
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా కామర్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో అత్యధికంగా కామర్స్ సీట్లే భర్తీ అవుతున్నాయి. మరోవైపు లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. ఒకప్పుడు సైన్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు కామర్స్ కోర్సులకే బ్రహ్మరథం పడుతున్నారు. జూన్ 16న, 30న కేటాయించిన దోస్త్ మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. గత రెండేళ్లుగా కామర్స్‌వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఈ కోర్సు చేసిన దాదాపు 60 శాతం వరకు విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరంలోనూ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు తీసుకుంటున్నవారిలో ఎక్కువ మంది కామర్స్ కోర్సునే ఎంచుకుంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని, ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial