(Source: ECI/ABP News/ABP Majha)
Commerce Courses: డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో 'జాబ్' కోర్సులకే డిమాండ్, అత్యధికంగా భర్తీ అయిన సీట్లు అవే!
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా కామర్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో ఎక్కువగా కామర్స్ సీట్లే భర్తీ అవుతున్నాయి. ఇక సైన్స్ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది.
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో గత కొన్నేళ్లుగా కామర్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో డిగ్రీ సీట్ల కేటాయింపుల్లో అత్యధికంగా కామర్స్ సీట్లే భర్తీ అవుతున్నాయి. మరోవైపు లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. ఒకప్పుడు సైన్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు కామర్స్ కోర్సులకే బ్రహ్మరథం పడుతున్నారు. జూన్ 16న, 30న కేటాయించిన దోస్త్ మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
గత రెండేళ్లుగా కామర్స్‌వైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ఈ కోర్సు చేసిన దాదాపు 60 శాతం వరకు విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరంలోనూ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు తీసుకుంటున్నవారిలో ఎక్కువ మంది కామర్స్ కోర్సునే ఎంచుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరానికి మొదటి, రెండో విడతలో కలిపి మొత్తం 1,22,487 డిగ్రీ సీట్లు భర్తీ అయ్యియి. అయితే ఇందులో మొదటి విడతలో అన్ని బ్రాంచీలు కలిపి 73,220 కాగా, రెండో విడతలో 49,267 సీట్లు ఉన్నాయి. మొదటి విడతలో కామర్స్ కోర్సును ఎంచుకున్న వారు 33,251 ఉంటే, రెండో విడతలో కేవలం కామర్స్ కోర్సు సీట్లు పొందిన వారే 21,255 మంది ఉన్నారు. అంటే మొత్తం 54,506 కామర్స్ సీట్లు భర్తీ అయ్యాయి.
గతేడాది 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 2,10,970 డిగ్రీ సీట్లుంటే అందులో 87,470 మంది విద్యార్థులు కామర్స్ కోర్సుల్లోనే చేరారు. అంటే 40 శాతంపైగా విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తికాగా, మూడో విడత ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 20న మూడో విడత సీట్లను కేటాయించనున్నారు. మూడో విడతలోనూ కామర్స్ వైపే విద్యార్థులు అత్యధికంగా మొగ్గు చూపుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొని కోర్సులను మార్చుకుంటారు.
సైన్స్ కోర్సులపై అనాసక్తి..
డిగ్రీ కోర్సుల ఎంపికలో మొదటి స్థానంలో కామర్స్ కోర్సు ఉంటే రెండో స్థానంలో లైఫ్ సైన్స్ కోర్సు, మూడో స్థానంలో ఫిజికల్ సైన్స్ కోర్సు, నాల్గో స్థానంలో ఆర్ట్స్ కోర్సులున్నాయి. మొదటి విడత దోస్త్ అడ్మిషన్లలో కామర్స్‌లో విద్యార్థులకు 33,251 సీట్లు కేటాయించగా, లైఫ్ సైన్సెస్‌లో 16,434 మంది, ఫిజికల్ సైన్సెస్‌లో 13,468, ఆర్ట్స్‌లో 7,771 మంది సీట్లు పొందారు. ఇక రెండో విడతలోనూ కామర్స్‌లో 21,255 మందికాగా, లైఫ్ సైన్సెస్‌లో 11,944 మంది, ఫిజికల్ సైన్సెస్‌లో 9,076 మంది, ఆర్ట్స్‌లో 6307 మంది సీట్లు పొందారు. మిగతా కోర్సుల్లో ఇంకా చాలా తక్కువ మంది సీట్లు పొందారు. కామర్స్ కోర్సుల్లో కంప్యూటర్స్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంతి కొత్త సబ్జెక్టులను చేర్చారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కామర్స్ నేపథ్యం ఉన్న సిబ్బందికి డిమాండ్ పెరిగింది. గత ఆరేళ్ల క్రితం సైన్స్ డిగ్రీ కోర్సుల్లో 46 శాతం విద్యార్థులు చేరితే ప్రస్తుతం 36 శాతమే చేరుతున్నారు. 2017-18లో బీకాంలో 80,776 మంది విద్యార్థులు చేరితే, 2022-23కు వచ్చే సరికి ఆ సంఖ్య 87,480కి పెరిగింది.
ALSO READ:
ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్, జేఈఈ మెయిన్ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్ మీటింగ్‌కు సంబంధించిన తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial