KNRUHS: నర్సింగ్, ఫిజియోథెరపి కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి - వెబ్‌సైట్‌లో అర్హుల జాబితా, 25 వరకు వెబ్ ఆప్షన్లు!
బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో..
తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి నవంబరు 22 నుంచి 25 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం (నవంబరు 21న) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది.
యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీకోర్సుల్లో కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నవంబరు 22న ఉదయం 8 గంటల నుంచి నవంబరు 25 సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. తుది మెరిట్ జాబితాకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. కళాశాల వారీగా సీట్ల వివరాలను చూసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
వెబ్ ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..
Also Read:
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తోంది. ప్రవేశాలు కోరే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నవంబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!
ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆడియో, మ్యూజిక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 6 నెలల, ఏడాది, రెండేళ్ల కాలపరిమితిలో వోకల్ ట్రైనింగ్, ఇన్‌స్ట్రుమెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'యూగో'తో అమ్మాయిల చదువు 'గో-ఎహెడ్'! స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం!
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిల చదువు కోసం మేమున్నామంటూ ముందుకొస్తుంది ‘యూగో (U-Go)’ అనే స్వచ్ఛంద సంస్థ. స్కాలర్‌షిప్ ప్రోగ్రామింగ్ ద్వారా చేయూత అందిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ‘గివ్‌ఇండియా’తో కలిసి ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. కాలిఫోర్నియాకు చెందిన ‘యూగో’ అనేది స్వచ్ఛంద సంస్థ. ఏడు దేశాల్లోని ఆర్థికంగా వెనకబడిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తోంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..