PSTU Spot Admissions: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు, నవంబరు 25 వరకు గడువు!!
హైదరాబాద్ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందాలి.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తోంది. ప్రవేశాలు కోరే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నవంబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
క్యాంపస్‌ల వారీగా ప్రవేశ కోర్సుల వివరాలు..
🔰 హైదరాబాద్ క్యాంపస్
డిగ్రీ కోర్సులు: చిత్రలేఖనం, శిల్పం, డిజైన్లు(ప్రాడక్ట్, ఇంటీరియర్), లైబ్రరీ సైన్స్.
పీజీ కోర్సులు: చిత్రలేఖనం, శిల్పం, జానపద, రంగస్థల కళలు, తెలుగు, సంగీతం, నృత్యం, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, భాషాశాస్త్రం, జ్యోతిషం.
🔰 రాజమండ్రి క్యాంపస్
పీజీ కోర్సులు: ఎంఏ(తెలుగు)
🔰 శ్రీశైలం క్యాంపస్
పీజీ కోర్సులు: ఎంఏ (చరిత్ర, సంస్కృతి, పురావస్తు), కూచిపూడి ప్రాంగణంలో ఎంపీఏ(డాన్స్).
Also Read:
GEST-2023: ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్, దరఖాస్తు ఇలా!
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకారవేతనం అందించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. దీనికి ఈ ఏడాది డిసెంబరు 4న 'గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ -2023)' పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదోతరగతి చదివే బాలికలు ఈ పరీక్ష రాయడానికి అర్హులని.. మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్ పూర్తయ్యేవరకూ ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబరు 11 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 76600 02627/28 నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.
వివరాలు..
* గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (GEST)
అర్హత: 2023 మార్చి/ఏప్రిల్ పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జీకే, రీజినింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయిలోనే పరీక్ష ఉంటుంది.
పరీక్షకు హాజరయ్యేవారు తీసుకురావాల్సినవి: రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బ్లాక్ పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్, ఫొటో ఐడీకార్డు లేదా స్కూల్ ఐడీ కార్డు, మాస్కులు, శానిటైజర్.
ముఖ్యమైన తేదీలు..
⫸ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.11.2022
⫸ దరఖాస్తుకు చివరితేది: 30.11.2022.
⫸ పరీక్ష తేది, సమయం: 04.12.2022 (ఆదివారం), ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
వేదిక: NTR Junior & Degree College for Women.
Chilukur Balaji Temple Road, Himayath Nagar Village,
Moinabad Mandal, R.R. Dist., Telangana 500075.