AU Audio - Music Courses: ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!
సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆడియో, మ్యూజిక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 6 నెలల, ఏడాది, రెండేళ్ల కాలపరిమితిలో వోకల్ ట్రైనింగ్, ఇన్‌స్ట్రుమెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి.
కోర్సుల వివరాలు...
1) సర్టిఫికేట్ కోర్సు - సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్
విభాగాలు: రూమ్ అకోటిక్స్ బేసిక్స్, స్టూడియో హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్ ఆపరేషన్ (ఆడియో మిక్సర్స్, ఆడియో ఆంప్లిఫైర్స్, మైక్రోఫోన్స్, కనెక్షన్ కేబుల్స్), మ్యూజిక్ థియరీ బేసిక్స్ (బిగినర్స్ లెవల్), డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్స్ (DAW) ఇంట్రడక్షన్.
కోర్సు వ్యవధి: 3 నెలలు.
2) డిప్లొమా కోర్సు - రీ-రికార్డింగ్ అండ్ ప్రొడక్షన్
విభాగాలు: మ్యూజిక్ థియరీ (ఇంటర్మీడియట్ లెవల్), ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్, వర్కింగ్ ఆన్ డిఫరెంట్ డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్స్ (DAW), లైవ్ సౌండ్ రి-ఎన్‌ఫోర్స్‌మెంట్.
కోర్సు వ్యవధి: 6 నెలలు.
3) పీజీ డిప్లొమా కోర్సు - రికార్డింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్
విభాగాలు: మ్యూజిక్ థియరీ, ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్, సౌండ్ డిజైన్, లైవ్ సౌండ్ రి-ఎన్‌ఫోర్స్‌మెంట్.
కోర్సు వ్యవధి: 12 నెలలు.
4) వోకల్ ట్రైనింగ్
విభాగాలు: కాన్‌టెంపరరీ వాయిస్ ట్రైనింగ్, వెస్ట్రర్న్ క్లాసికల్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్, ఫిల్మ్ బేస్డ్ వోకల్ ట్రైనింగ్.
5) ఇన్‌స్ట్రుమెంట్స్
విభాగాలు: పియానో, డ్రమ్స్, గిటార్, మాండోలిన్, వెస్ట్రర్న్ వయోలిన్, ఫ్లూట్, తబలా, సితార్, ట్రంపెట్, సాక్సోఫోన్, షెహనాయ్ తదితరాలు..
పై కోర్సుల వ్యవధి (4, 5): 6, ఏడాది, రెండేళ్లు.
రిజిస్ట్రేషన్, తదితర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 6304020609, 6304002785.
Notification
Also Read:
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తోంది. ప్రవేశాలు కోరే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నవంబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'యూగో'తో అమ్మాయిల చదువు 'గో-ఎహెడ్'! స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం!
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిల చదువు కోసం మేమున్నామంటూ ముందుకొస్తుంది ‘యూగో (U-Go)’ అనే స్వచ్ఛంద సంస్థ. స్కాలర్‌షిప్ ప్రోగ్రామింగ్ ద్వారా చేయూత అందిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ‘గివ్‌ఇండియా’తో కలిసి ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. కాలిఫోర్నియాకు చెందిన ‘యూగో’ అనేది స్వచ్ఛంద సంస్థ. ఏడు దేశాల్లోని ఆర్థికంగా వెనకబడిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తోంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి..