UPSC Recruitment 2021: యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్లు... ఆ ఉద్యోగాలేంటంటే...
నిరుద్యోగులకు శుభవార్త. యూపీఎస్సీ నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలంటే మాటలా. ఎంతో మంది నిరుద్యోగల కలల సంస్థ అది. ఇప్పుడు ఆ కేంద్ర సంస్థ నుంచి వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్, అసిస్టెంట్ డైరెక్టర్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు upsconline.nic.in ఉన్నాయి. ఆ వెబ్ సైట్లోనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు యూపీఎస్సీ అధికారులు. ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 11. ఆ ఉద్యోగాలకు సంబంధించి వివరాలు ఇవిగో...
అసిస్టెంట్ ప్రొఫెసర్
ఇది కేవలం ఒక పోస్టు మాత్రమే ఖాళీ ఉంది. దీనికి విద్యార్హత మెకట్రోనిక్స్ ఇంజినీరింగ్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. వయసు 38 ఏళ్లకు మించి ఉండకూడదు. జాబ్ లొకేషన్ దిల్లీ.
అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్
బీటెక్, బీఈ చదివిన వారంతా ఈ ఉద్యోగానికి అర్హులే. రెండేళ్ల పాటూ పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు దాటకూడదు.
అసిస్టెంట్ డైరెక్టర్
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్, బీఈ, బీఏఎమ్ఎస్, బీయూఎమ్ఎస్, ఎమ్ఏ, ఎమ్ కామ్, ఎమ్మెస్సీ, ఎంసీఏ చదివిన వారంతా దీనికి అర్హులే. వయసు పరిమితి 35 ఏళ్లు.
మెడికల్ ఆఫీసర్
బీటెక్, బీఈ, బీఏఎమ్ఎస్, బీయూఎమ్ఎస్, ఎమ్ఏ, ఎమ్ కామ్, ఎమ్మెస్సీ, ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పరిమితి 35 ఏళ్లు.
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు వయసు పరిమితి 35 ఏళ్లు. బీటెక్, బీఈ, ఎమ్మెస్సీ చదివిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.
చివరితేదీ
పై ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 11, 2021.
Also Read: ఏడో తరగతి పూర్తైన బాలికలకు అద్భుత అవకాశం.. RIMCలో ప్రవేశానికి TSPSC ప్రకటన జారీ
Also Read: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..
Also read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు