అన్వేషించండి

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 అడ్మిట్‌కార్డులు విడుదల - పరీక్ష వివరాలు ఇవే!

JEE Main - 2024: మొదటి విడత పరీక్షకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచింది.

JEE Main 2025  Paper 1  Exam  Admitcard: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి అడ్మిట్‌కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)'  విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే  ప్రస్తుతానికి జనవరి 22, 23, 24 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు మాత్రమే విడుదలయ్యాయి. ఈసారి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 13.8 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల అవుతాయి. జనవరి 22వ తేదీ నుంచి బీఈ, బీటెక్‌ పేపర్‌1 రాత పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. పేపర్‌ 2ఏ (బీఆర్క్‌), పేపర్‌ 2బీ (బీ ప్లానింగ్‌), పేపర్‌ 2ఏ, 2బీ (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ రెండింటికి) పరీక్ష జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరగనుంది.  ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. ఇక జనవరి 31 తేదీన సెకండ్‌ షిఫ్ట్‌లో బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ పేపర్‌ 2ఏ, 2బీ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయి.

JEE Main 2025 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం..

➥పేపర్‌-1(బీటెక్, బీఈ) పరీక్ష
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్‌-ఎ 20 మార్కులు, సెక్షన్‌-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో  బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు. 

➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి. 

➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు..
తెలంగాణలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏపీలో అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, మంగళగిరి, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం తదితర చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IITs), ఎన్‌ఐటీలు(NITs), ట్రిపుల్‌ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విడత పరీక్షలను జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఇక పేపర్-1 పరీక్షలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget