అన్వేషించండి

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల వరకు

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష అడ్మిట్‌‌కార్డును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 23న విడుదల చేసింది. ఆగస్టు 28 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.

 

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. JEE (Advanced) 2022 Admit Cards

 

జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 8 నుంచి 12 వరకు కొనసాగింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలి.

 

Also Read: TS ICET 2022: తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఎప్పుడంటే?

 

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

స్టెప్1: అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత JEE Advanced 2022 అధికారిక పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న JEE Advanced 2022 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి

స్టెప్3: అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ వివరాలను ఎంటర్ చేసి SUBMIT చేయాలి.

స్టెప్ 4: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్ 5: అడ్మిట్ కార్డు కాపీని సేవ్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి. ఈ అడ్మిట్ కార్డును తప్పసరిగా ఒకసారి పరిశీలించండి. తప్పులు ఉంటే ఫిర్యాదు చేయండి.

పరీక్ష రోజున అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేనిపక్షంలో పరీక్ష హాలులోకి అనుమతించరు. అడ్మిట్ కార్డ్‌లో దరఖాస్తుదారు పేరు, అప్లికేషన్ నంబర్, సబ్జెక్ట్‌ వివరాలు ఉంటాయి. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టిక్కెట్‌లలోని మొత్తం సమాచారాన్ని ఓసారి క్రాస్-చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి రిపోర్ట్ చేయాలి.


అడ్మిట్ కార్డులో ఉండే సమాచారం
ఇందులో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, లింగం, వర్గం, రాష్ట్రం, JEE అప్లికేషన్ నంబర్, పరీక్ష సబ్జెక్ట్ పేర్లు, పరీక్ష తేదీలు, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష తేదీ- సమయం, అభ్యర్థి సంతకం- ఫోటో తదితర వివరాలు ఉంటాయి. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాల నిమిత్తం JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు.


Also Read: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే? 

 

ముఖ్యమైన తేదీలు..
✪ జేఈఈ అడ్వా్న్స్డ్ రిజిస్ట్రేషన్: 08.08.2022 - 11.08.2022.

✪ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.08.2022.

✪ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: 23.08.2022 - 28.08.2022.

✪ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష తేది: 28.08.2022.


Also Read: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?


పరీక్ష సమయం: 

పేపర్-1: ఉ. 9.00 గం. - మ.12:00 గం. వరకు.

పేపర్-2: మ.14:30 - సా.17:30 గం. వరకు.

✪ ప్రాథమిక కీ: 03.09.2022.

✪ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 - 04.09.2022. 

✪ తుది ఆన్సర్ కీ: 11.09.2022.

✪ ఫలితాల వెల్లడి: 11.09.2022.


* ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2022


✪ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 11.09.2022 - 12.09.2022.

✪ జాయింట్ సీట్ అలొకేషన్ ప్రారంభం (JoSAA): 12.09.2022.

✪ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: 14.09.2022.

✪ ఫలితాల వెల్లడి: 17.09.2022

 

JEE (Advanced)-2022: Information Brochure

JEE (Advanced)-2022: Online Registration Portal

 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
Tirumala News: అమరావతిలో పెళ్లి చేసుకోనున్న తిరుమల శ్రీనివాసుడు- విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
అమరావతిలో పెళ్లి చేసుకోనున్న తిరుమల శ్రీనివాసుడు- విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ  
SLBC Tunnel News:కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
Embed widget