అన్వేషించండి

TS Inter Supplementary Results 2022: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?

మరో వారంరోజుల్లో పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

TS Inter Supplementary Results 2022: తెలంగాణ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు  గుడ్ న్యూస్.. మరో వారంరోజుల్లో పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 


WEBSITE   

తెలంగాణలో ఆగస్టు 1 నుంచి 10 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,34,329 మంది, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,13,267 మంది విద్యార్థులు హాజరయ్యారు.


ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలకు మొత్తం 9.28 లక్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు,  మే 7 నుంచి 24వ వరకు  సెంకడ్ ఇయర్ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణులయ్యారు. రెగ్యూలర్ పరీక్షల్లో ఫెయిలైన వారికి ఆగస్టు 1 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఆగస్టు నెలాఖరులో విడుదల చేయనున్నారు.


Also Read:

HORTICET - 2022: ఏపీ హార్టీసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్‌-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టీసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

Also Read:

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ కోటా కింద పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో పీజీ మెడికల్, పీజీ డెంటల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఈ కోర్సులకు ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ అర్హతతోపాటు నీట్-పీజీ 2022/ నీట్ ఎండీఎస్ 2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సులకు 31.05.2022 నాటికి, పీజీ డెంటల్ కోర్సులకు 31.03.2022 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.7,080 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,900 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్  కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న  నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget