అన్వేషించండి

HORTICET - 2022: ఏపీ హార్టీసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్‌-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


హార్టీసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.


ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి. అక్టోబరు 12న హార్టీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

వివరాలు:


1) నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాం


సీట్ల సంఖ్య: 92 


అర్హత:
డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు ఉత్తీర్ణత.


వయోపరిమితి:
31.12.2022 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 25 సంవత్సరాలు, దివ్యాంగులు 27 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.


దరఖాస్తు ఫీజు:
రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.  “COMPTROLLER, Dr.YSRHU, TADEPALLIGUDEM” పేరిట నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. ఖాతాదారుడి పేరు: COMPTROLLER, Dr.YSRHU, అకౌంట్ నెంబర్: 055011011002545, FSC/RTGS కోడ్: UBIN0805505, బ్రాంచ్ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తాడేపల్లి గూడెం.


ఎంపిక విధానం: ఏపీ హార్టీసెట్‌-2022 ద్వారా.


పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 200 బహుళైచ్చిక ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. తెలుగు మాధ్యమంలోనే ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం తప్పనిసరి. 


పరీక్ష కేంద్రాలు:
పశ్చిమగోదావరి, కడప, విజయనగరం, ప్రకాశం. ఆయా జిల్లాల హార్టికల్చర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో హార్టిసెట్-2022 పరీక్ష నిర్వహిస్తారు.


అర్హత మార్కులు:
హార్టీసెట్-2022 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కుల శాతాన్ని 25% గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు.


ముఖ్యమైన తేదీలు..

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.08.2022.

* దరఖాస్తుకు చివరి తేది: 17.09.2022.

* పరీక్ష తేది: 12-10-2022.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Registrar, 
Dr.Y.S.R Horticultural University, 
Venkataramannagudem-534101, 
West Godavari District, Andhra Pradesh. 

 

Notifiation & Application

 

Website

 

Also Read:

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ కోటా కింద పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో పీజీ మెడికల్, పీజీ డెంటల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఈ కోర్సులకు ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ అర్హతతోపాటు నీట్-పీజీ 2022/ నీట్ ఎండీఎస్ 2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సులకు 31.05.2022 నాటికి, పీజీ డెంటల్ కోర్సులకు 31.03.2022 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.7,080 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,900 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్  కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న  నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget