అన్వేషించండి

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 12న నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీలోని పారా మెడికల్  కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న  నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సుల వివరాలు..

1)  బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)- నర్సింగ్ 

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

అర్హత: ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత. ఒకేషనల్ కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయోపరిమితి: 31.12.2022 నాటికి 17 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

2) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

అర్హత: ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత. ఒకేషనల్ కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయోపరిమితి: 31.12.2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 

3) బీఎస్సీ (పారామెడికల్ టెక్నాలజీ)

పారామెడికల్ విభాగాలు: మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, న్యూరో ఫిజియోలజీ, ఆప్టొమెట్రిక్ టెక్నాలజీ, రీనాల్ డయాలసిస్, కార్డియాక్  కేర్, అనస్తీషియాలజీ, ఇమేజింగ్, ఎమెర్జీన్సీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ.

అర్హత: ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత. ఒకేషనల్ కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 31.12.2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 

4) పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 
 
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత (లేదా) ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. స్ర్తీ, పురుషులిద్దరూ దరఖాస్తుకు అర్హులే.  

వయోపరిమితి: 31.12.2022 నాటికి 21-45 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎంపికచేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.2360. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1888. 

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ విడుదల: 12.08.2022.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.08.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.09.2022.

B.Sc., (Nursing) 4YDC, BPT and B.Sc., Paramedical Technology Courses Notification 
     
    Online Application

➤  Post Basic BSc., (Nursing) 2YD Course Notification 

     Online Application

BSc Nursing 4YDC- 2022-23- Prospetus 

BSc MLT- 2022-23- Prospetus 

➤ BPT- 2022-23- Prospetus 

Post Basic Nursing- 2022-23- Prospetus 

Also Read:

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ కోటా కింద పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో పీజీ మెడికల్, పీజీ డెంటల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఈ కోర్సులకు ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ అర్హతతోపాటు నీట్-పీజీ 2022/ నీట్ ఎండీఎస్ 2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సులకు 31.05.2022 నాటికి, పీజీ డెంటల్ కోర్సులకు 31.03.2022 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.7,080 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,900 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

CLAT 2023: కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రక‌ట‌న విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.
కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023 వివరాల కోసం క్లిక్ చేయండి

MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2022 సెప్టెంబర్ సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 సెప్టెంబరుకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
మ్యాట్ - సెప్టెంబరు 2022 సెషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Embed widget