By: ABP Desam | Updated at : 02 Aug 2022 11:57 PM (IST)
MAT September 2022
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2022 సెప్టెంబర్ సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 సెప్టెంబరుకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు...
* మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్ ) సెప్టెంబరు 2022 సెషన్
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్నెట్/పేపర్/కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1850. రెండు విధానాల్లో పరీక్షలు రాసేవారు రూ.2975 చెల్లించాలి.
Also Read: ఆగస్టు 3 నుంచి క్యాట్-2022 దరఖాస్తులు - అర్హతలు, ముఖ్యతేదీలివే!
పరీక్ష విధానం:
Also Read: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!
సిలబస్..
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: ఇందులో అభ్యర్థి ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం, గ్రామర్ పరిజ్ఞానం తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పేరా జంబుల్, రీడింగ్ కాంప్రహెన్షన్, అనలిటికల్ ఎబిలిటీ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్: ఇందులో క్రిటికల్ రీజనింగ్‌పై అభ్యర్థుల ప్రతిభను తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువగా ప్యాసేజ్-కన్‌క్లూజన్, స్టేట్‌మెంట్-ఆర్గ్యుమెంట్, అనాలజీ బేస్డ్ ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, కోడింగ్ అండ్ డీ కోడింగ్, ఫ్యామిలీ ట్రీ, ఎఫెక్ట్ అండ్ కాజ్, సీక్వెన్సింగ్ గుర్తించడం వంటి ప్రశ్నలు అడుగుతారు.
మ్యాథమెటికల్ స్కిల్స్: ఈ విభాగంలో పదో తరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా జామెట్రీ, నంబర్ సిస్టమ్, ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్, ప్రోగ్రెషిన్, ఆల్జీబ్రా, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశముంది.
డేటా అనాలసిస్ అండ్ సఫిషియన్సీ: ఈ విభాగంలో గ్రాఫ్స్(ఏరియా అండ్ లైన్), డేటా విశ్లేషణ(సఫిషియన్సీ), వెన్ రేఖాచిత్రాలు, పై చార్‌ట్స, పజిల్స్, టేబుల్స్ వంటి అంశాల్లో అభ్యర్థుల ప్రావీణ్యం తెలుసుకునేలా ప్రశ్నలు ఎదురవుతాయి.
ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్: ఈ విభాగం ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక అంశాలు, చరిత్ర, పాలిటిక్స్, సైన్స్, అవార్డులు, కరెంట్ అఫైర్స్, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్‌పై అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
* ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష (IBT) : 28.08.2022 – 17.09.2022 వరకు.
* పేపర్ ఆధారిత పరీక్ష(PBT) : 04-09-2022.
* కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) : 18-09-2022.
* దరఖాస్తుకు చివరి తేది(PBT) : 29.08.2022.
* దరఖాస్తుకు చివరి తేది(CBT) : 12.09.2022.
* దరఖాస్తుకు చివరి తేది(IBT) : 24-08-2022, 31-08-2022, 06-09-2022, 07-09-2022, 13-09-2022.
TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!
CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు
TS EAMCET 2022 Toppers: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాపర్లు వీరే!
JEE Advanced 2022 Registration: నేటితో జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుకు ఆఖరు, ఈ సమయం వరకే అవకాశం!
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?
Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్