AP Inter Supplementary Results 2022: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి ఆగస్టు 12 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
AP Inter supply Results 2022: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల వెల్లడికి సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు నెలాఖరులోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలను ఆగస్టు 28 లేదా 29 తేదీల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Also Read: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి ఆగస్టు 12 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరిగాయి. దాదాపు 3 లక్షలకు పైగా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.
Also Read: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ, స్లాట్ బుకింగ్ ఇలా!
ఈ ఏడాది మే 6 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం నుంచి మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 65 శాతం పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణ జిల్లా 72 శాతం, స్వల్పంగా కడప 55 శాతం నమోదైంది.
విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను https://bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 ఇలా చెక్ చేసుకోండి (How to check AP Inter Results 2022)
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2022 లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి.
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: రిజల్ట్స్‌ను విద్యార్థులు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాలు లాంటి భవిష్యత్ అవసరాల కోసం మీ ఫలితాలను ప్రింటౌట్ తీసుకోవడం మంచిది.
Also Read:
HORTICET - 2022: ఏపీ హార్టీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టీసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..