By: ABP Desam | Updated at : 26 Sep 2021 09:18 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్- 2021 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జేఈఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్ నిర్వహిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని అక్టోబర్ 10న విడుదల చేస్తారు. పరీక్ష ఫలితాలను అక్టోబర్ 15న ప్రకటిస్తారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష తుది ఫలితాలు అక్టోబర్ 15న విడుదల కానున్నాయి.
Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్- 2021 హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
1. జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్ ను తెరవండి.
2. ఇక్కడ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్ అని ఉన్న ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేయాలి.
4. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్ష హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. అడ్వాన్స్‌డ్ పరీక్ష సహా భవిష్యత్ అవసరాల కోసం దీనిని ప్రింటవుట్ తీసుకోవడంతో పాటు పీడీఎఫ్‌ను భద్రపరుచుకోండి.
అక్టోబర్ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్..
దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి మొదలు కానుంది. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా– JoSAA) ఈ మేరకు జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలైన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
Also Read: CBSE On Covid19: ఆ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త.. కొవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో బోర్డు కీలక ప్రకటన
Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?
TS Teachers Transfers: నేడు ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా వెల్లడి!
TS Teachers Transfers : ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Teachers Transfers: రేపటి నుంచే టీచర్ల బదిలీల ప్రక్రియ! ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం! షెడ్యూలు ఇలా!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?