అన్వేషించండి

అటవీ వ్యవసాయంలో పరిశోధనలకు కీలక ఒప్పందం, సీఎఫ్‌ఎన్ఆర్‌ఎంతో జతకట్టిన జయశంకర్ వర్సిటీ

తెలంగాణలో అటవీ వ్యవసాయ పరిశోధనలు విస్తృతం కానున్నాయి. ఈ మేరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ ఫారెస్ట్ & నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ స్టడీస్ మధ్య ఒప్పందం.

తెలంగాణలో అటవీ వ్యవసాయ పరిశోధనలు ఇకపై మరింత విస్తృతం కానున్నాయి. ఈ మేరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, దూలపల్లిలోని అటవీ-సహజ వనరుల నిర్వహణ అధ్యయన కేంద్రం(సెంటర్ ఫర్ ఫారెస్ట్ & నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ స్టడీస్ -CFNRM) మధ్య సోమవారం (ఆగస్టు 7) అవగాహన ఒప్పందం కుదిరింది. అటవీ వ్యవసాయం, జీవవైవిద్య సంరక్షణపై కలిసి పని చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది.

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ర్‌ డాక్టర్‌ ఎం.వెంకటరమణ, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్‌ ఎస్‌.జె.ఆశా అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు, రైతులకు, అటవీ వ్యవసాయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒప్పందం తోడ్పడుతుందన్నారు. యూనివర్సిటీ అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్‌ జమునారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, అటవీ వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ:

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి ఆగస్టు 6న ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగ‌స్టు 19లోపు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇత వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సీపెట్‌‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ..
ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (సీపెట్) ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారికి మెషీన్‌ ఆపరేటర్‌-ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు కేంద్ర పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ సంస్థ(సీపెట్‌) జేడీ సీహెచ్‌ శేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తోపాటు అనంతపురం, హైదరాబాద్‌, బెంగళూరు, హోసూర్‌, చెన్నై ప్రాంతాల్లో ప్రముఖ ప్లాస్టిక్స్‌, అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయి. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఫోన్‌ నంబరు 6300147965 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఆగస్టు 11 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Nellore News: పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
Embed widget