అన్వేషించండి

APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు...

* రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌ - 8వ తరగతి ప్రవేశాలు (జులై సెషన్)

అర్హత: 01.07.2024 నాటికి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఏడోతరగతి ఉత్తీర్ణులు/చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 11.5 - 13 సంవత్సరాల మధ్య ఉండాలి.  02.07.2011 - 01.01.2013 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించగానే ఆర్‌ఐఎంసీ దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌, పాత ప్రశ్నపత్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపుతారు. విద్యార్థులు దరఖాస్తు ఫారాన్ని నింపి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి ఏపీపీఎస్సీ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుతోపాటు అభ్యర్థులు మున్సిపల్‌ కార్పొరేషన్‌/గ్రామ పంచాయతీ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌; నివాసం, కులం ధ్రువీకరణ పత్రాలు; బోనఫైడ్‌ సర్టిఫికెట్‌; ఆధార్‌ కార్డ్‌; విద్యార్థి 2 ఫొటోలు పంపాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, వాయిస్ వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. లేదా సంబంధిత చిరునామాకు డిమాండ్ డ్రాఫ్ట్ పంపడం ద్వారా కూడా దరఖాస్తులు పొందవచ్చు. 

రాత పరీక్ష: మొత్తం మార్కులు 400. ఇంగ్లీష్‌ నుంచి 125 మార్కులకు, మేథమెటిక్స్‌ నుంచి 200 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు సమాధానాలను హిందీ లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి వైవా వోస్‌ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఇందులో ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాలు పరీక్షిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రం: విజయవాడ.

డిడి పంపాల్సిన చిరునామా:
“THE COMMANDANT RIMC FUND”, DRAWEE BRANCH, HDFC BANK, BALLUPUR CHOWK,
DEHRADUN, (BANK CODE - 1399), UTTARAKHAND

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Assistant Secretary (Exams), 
APPSC Public, New Heads of Departments Building, 
Second Floor, Near RTA Office, Indira Gandhi Municipal Stadium, 
MG Road, Vijayawada- 520010, Andhra Pradesh.

ముఖ్యమైన తేదీలు..

➥ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 15.10.2023.

➥ పరీక్ష తేది: 02.12.2023.

పరీక్ష సమయం:

➥ మ్యాథమెటిక్స్ - ఉ.9:30 గం. – ఉ.11:00 గం. వరకు

➥ జనరల్ నాలెడ్జ్ - మ.12:00 గం.- మ.13:00 గం. వరకు

➥ ఇంగ్లిష్ - మ.14:30గం.- సా.16:30 గం. వరకు

Notification

Web Note

Website

ALSO READ:

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Chandrababu Birthday: చంద్రబాబు అనితర సాధ్యుడు, విజన్ అంటే ఆయనే.. ఏపీ సీఎంకు రేవంత్ రెడ్డి, జగన్, పవన్ కళ్యాణ్ విషెస్
చంద్రబాబు అనితర సాధ్యుడు, విజన్ అంటే ఆయనే.. ఏపీ సీఎంకు రేవంత్ రెడ్డి, జగన్, పవన్ కళ్యాణ్ విషెస్
JD Vance: భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు, అక్షర్​ధామ్​ సందర్శన.. మోదీతో విందు పర్యటన- విశేషాలు
భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు, అక్షర్​ధామ్​ సందర్శన.. మోదీతో విందు పర్యటన- విశేషాలు
SSMB29: 'SSMB29' మూవీ బిగ్ అప్ డేట్ - 3 వేల మందితో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్
'SSMB29' మూవీ బిగ్ అప్ డేట్ - 3 వేల మందితో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Avesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP DesmRR vs LSG Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 2పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం | ABP DesamVaibhav Suryavanshi Batting vs LSG | IPL 2025 తో అరంగేట్రం చేసిన 14ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
Chandrababu Birthday: చంద్రబాబు అనితర సాధ్యుడు, విజన్ అంటే ఆయనే.. ఏపీ సీఎంకు రేవంత్ రెడ్డి, జగన్, పవన్ కళ్యాణ్ విషెస్
చంద్రబాబు అనితర సాధ్యుడు, విజన్ అంటే ఆయనే.. ఏపీ సీఎంకు రేవంత్ రెడ్డి, జగన్, పవన్ కళ్యాణ్ విషెస్
JD Vance: భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు, అక్షర్​ధామ్​ సందర్శన.. మోదీతో విందు పర్యటన- విశేషాలు
భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు, అక్షర్​ధామ్​ సందర్శన.. మోదీతో విందు పర్యటన- విశేషాలు
SSMB29: 'SSMB29' మూవీ బిగ్ అప్ డేట్ - 3 వేల మందితో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్
'SSMB29' మూవీ బిగ్ అప్ డేట్ - 3 వేల మందితో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Ilaiyaraaja: ఆ సంగతి నాకు తెలిస్తే మ్యూజిక్ వదిలేస్తా - మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా
ఆ సంగతి నాకు తెలిస్తే మ్యూజిక్ వదిలేస్తా - మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా
SC Sub-Classification: ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్‌ జారీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
ఎస్సీ వర్గీకరణ అమలుకు సవరణ నోటిఫికేషన్‌ జారీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
Toxic soil Crisis: భారీ లోహాలతో పెరుగుతున్న భూ కాలుష్యం, ప్రమాదంలో 140 కోట్ల మంది- తాజా అధ్యయనం
భారీ లోహాలతో పెరుగుతున్న భూ కాలుష్యం, ప్రమాదంలో 140 కోట్ల మంది- తాజా అధ్యయనం
Embed widget