Instagram: పరీక్షలపై ఇన్‌స్టాగ్రామ్‌ సలహాలు- విద్యార్థులు, యువత కోసం కొత్త ఫీచర్స్‌

ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పుడు టీచర్‌లో బోధిస్తుంది. ఫ్రెండ్‌లా గైడ్ చేస్తుంది. పేరెంట్‌గా టైమ్‌ విలువ చెబుతుంది.

FOLLOW US: 

విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుడిలా విద్యార్థులను ప్రిపేర్ చేస్తుంటారు. క్లాస్‌టెస్టుల్లో, స్కూల్‌లో పెట్టిన మంచి మార్కులు వచ్చినప్పటికీ టెన్షన్ పడుతుంటారు. 

కరోనా కారణంగా రెండేళ్లు చదువులు సరిగ్గా సాగలేదు. పరీక్షలు కూడా సీరియస్‌గా జరగలేదు. కాని ఇప్పుడు మాత్రం క్లాస్‌లు పక్కాగా జరిగాయి. అందుకే ఈసారి పరీక్షల టెన్షన్ విద్యార్థుల్లో ఇంకా ఎక్కువగా ఉంది. 

విద్యార్థులు ఈ ఎగ్జామ్‌ ఫియర్ నుంచి బయటపడేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగెట్టేందుకు ఓ గైడ్ క్రియేట్ చేసింది. విద్యార్థులు ఎలా చదవాలి, పరీక్షలకు సిద్ధం చేయడం, పరీక్షల ఒత్తిడి అధిగమించడంపై సలహాలు సూచనలు ఇస్తుంది. ప్రత్యేకించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సహాయం చేసే లక్ష్యంగా దీన్ని క్రియేట్ చేసింది. 

'రీడ్ అండ్ రీడ్‌జస్ట్: బ్యాక్ టు ది క్లాస్‌రూమ్' పేరుతో ఫోర్టిస్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, సంగత్స్ ఇట్స్ ఓకే ఇనిషియేటివ్, ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. విద్యార్థులకు స్టడీ, పరీక్ష ప్రాధాన్యత గుర్తించడంతోపాటు స్కోరింగ్ కోసం చిట్కాలను కూడా అందిస్తుంది. ఒత్తిడి అధిగమించే వ్యూహాలను పరిచయం చేస్తుంది. ఏకాగ్రత మెరుగుపరచే పద్ధతులను అందిస్తుంది.

ఈ గైడ్‌లో స్వీయ రక్షణ, మానసిక ఆరోగ్యం కోసం షార్ట్‌టెర్మ్‌ రెమిడీస్‌తోపాటు భవిష్యత్‌లో అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేస్తుంది. ఈ గైడ్ పాఠశాలలు, తల్లిదండ్రులకు ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా పంపిణీ చేస్తారు. విద్యార్థులు, పాఠశాలలు, తల్లిదండ్రులు ఫోర్టిస్ మెంటల్ హెల్త్ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) పేజీలో గైడ్‌ను చూడవచ్చు. 1 మిలియన్ల 1 బిలియన్‌ వెబ్‌సైట్ నుంచి గైడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకుని ప్రజలను ఉపయోగపడేలా టేక్‌ ఏ బ్రేక్‌ పేరుతో కొత్త ఫీచర్ యాడ్ చేసింది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్ పబ్లిక్ పాలసీ హెడ్, ఫేస్‌బుక్ ఇండియా (మెటా) నటాషా జోగ్ మాట్లాడుతూ... యువత శ్రేయస్సును దృష్టి ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటిగా చెప్పారు. యువత జీవితాలను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 'రీడాప్ట్ అండ్ రీజస్ట్' గైడ్‌ తీసుకువచ్చామన్నారు. 

Tags: Instagram Exam Stress Fortis National Mental Health Fortis Healthcare 1M1B Foundation Natasha Jog Facebook India Readapt and Readjust Take A Break

సంబంధిత కథనాలు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

NEET PG 2022: నీట్ పీజీ- 2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం

NEET PG 2022: నీట్ పీజీ- 2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం

TS SSC Hall Ticket 2022: టెన్త్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - రెండు విధాలుగా పొందవచ్చని తెలుసా ! డైరెక్ట్ లింక్

TS SSC Hall Ticket 2022: టెన్త్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - రెండు విధాలుగా పొందవచ్చని తెలుసా ! డైరెక్ట్ లింక్

టాప్ స్టోరీస్

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

Weather Updates: ఏపీలో మరో 4 రోజులు వానలే! తెలంగాణలో నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

Weather Updates: ఏపీలో మరో 4 రోజులు వానలే! తెలంగాణలో నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ

Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్‌ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ