(Source: ECI/ABP News/ABP Majha)
IIP Admissions: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
IIP Admissions: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు జులై 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
Indian Institute of Packaging IIPCET - 2024: ముంబయి ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు రీజినల్ సెంటర్లలో పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, మాస్టర్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ (ఎంఎస్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సైన్స్ డిగ్రీ, ఎంఎస్ కోర్సులో ప్రవేశాలకు గ్రాడ్యుయేషన్ (ఇంజినీరింగ్ & టెక్నాలజీ) డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలున్నవారు జులై 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి జులై 14న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్రవేశాలు
కోర్సులు..
➥ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (PGDP) - 40వ బ్యాచ్
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హతలు..
⫸ కనీసం ద్వితీయ శ్రేణిలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్/ సైన్స్ గ్రాడ్యుయేట్/ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అర్హులు.
⫸ బీఎస్సీ (కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ / బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ లైఫ్ సైన్సెస్/ మెటీరియల్స్ సైన్స్ / బయోటెక్నాలజీ / జువాలజీ/ బోటనీ / అగ్రికల్చరల్ సైన్సెస్ / హార్టికల్చర్ సైన్సెస్ / వెటర్నరీ హార్టికల్చర్ సైన్సెస్/ డెయిరీ సైన్స్/ ఫుడ్ సైన్స్ & అప్లైడ్ న్యూట్రీషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎన్విరాన్‌మెంట్ సైన్స్/ పాలిమర్ కెమిస్ట్రీ/ ఫిషరీస్ సైన్స్/ నానోసైన్స్ ).
⫸ బీఫార్మసీ లేదా మూడేళ్ల ఫార్మస్యూటికల్ సైన్సెస్ కోర్సు.
⫸ బీటెక్/ బీఈ కోర్సులు – కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, బయోకెమికల్/బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, పల్ప్ & పేపర్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, ఆయిల్స్& సర్‌ఫాక్టంట్స్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ/ఐటీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, డెయిరీ టెక్నాలజీ/ ఇంజినీరింగ్, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ.
వయోపరిమితి: 31.05.2024 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీ విద్యార్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
➥ మాస్టర్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ (MS) - 4వ బ్యాచ్
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హతలు..
⫸ కనీసం ద్వితీయ శ్రేణిలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్/ సైన్స్ గ్రాడ్యుయేట్/ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అర్హులు.
⫸ బీటెక్/ బీఈ కోర్సులు – కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, బయోకెమికల్/బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, పల్ప్ & పేపర్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, ఆయిల్స్& సర్‌ఫాక్టంట్స్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ/ఐటీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, డెయిరీ టెక్నాలజీ/ ఇంజినీరింగ్, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ లేదా నాలుగేళ్ల సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.05.2024 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీ విద్యార్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 10.07.2024.
* ప్రవేశపరీక్ష తేదీ (IIPCET - 2024): 14.07.2024.
ALSO READ:
సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్షల షెడ్యూలు ఇదే
తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) -2024’ నోటిఫికేషన్ మే 15న విడుదలైంది. సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 18 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్యరుసుముతో జూన్ 25 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 5న సీపీగెట్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..