CPGET - 2024 Notification: సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్షల షెడ్యూలు ఇదే
CPGET: తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) -2024’ నోటిఫికేషన్ మే 15న విడుదలైంది.
CPGET 2024 Notification: తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) -2024’ నోటిఫికేషన్ మే 15న విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, వైస్‌ఛైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ రవీందర్, సెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి సహా పలు వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు.
మే 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 18 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్యరుసుముతో జూన్ 25 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 5న సీపీగెట్ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
సీపీగెట్ పరిధిలోని 294 కళాశాలల ద్వారా మొత్తం 51 పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 47 పీజీ కోర్సులు, 5 ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీతోపాటు.. కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ, తెలంగాణ మహిళా వర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. పీజీ సెట్ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి.
వివరాలు..
* సీపీగెట్ - 2024 నోటిఫికేషన్
ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు.
ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూహెచ్, తెలంగాణ మహిళా వర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
అర్హత: డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్ ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్ ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.05.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.06.2024.
➥ రూ.500 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.06.2024.
➥ రూ.2000 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.06.2024.
➥ సీపీగెట్-2024 పరీక్ష తేదీ: 05.07.2024.
ALSO READ:
విద్యార్థులకు అలర్ట్, 'దోస్త్' షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలు ఇవే
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్దేశించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ-DOST) మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మే 25తో ముగియాల్సిన దరఖాస్తు గడువును మే 29 వరకు అధికారులు పొడిగించారు. ఇక మే 15 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు మే 30 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు మే 28, 29 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. దోస్త్ మొదటి దశలో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జూన్ 6న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 7 నుంచి 12 మధ్య సంబంధిత కళాశాలలో సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
దోస్త్-2024 పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..