ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీఏ ఫౌండేషన్ డిసెంబరు 2022 ఫలితాలను చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 3న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
CA FoundationResults: సీఏ ఫౌండేషన్ డిసెంబరు 2022 ఫలితాలను చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 3న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించిన సీఏ ఫౌండేషన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. విద్యార్థులు రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
సీఏ ఫౌండేషన్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.- https://www.icai.org/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Important Announcements' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
➥ తర్వాత 'Results of the CAFoundation December 2022' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
➥ అక్కడ విద్యార్థులు తమ రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
➥ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
Results of the Chartered Accountants Foundation Examination
Also Read:
జేఈఈ మెయిన్ ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఫిబ్రవరి 2న ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలతో పాటు ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఫిబ్రవరి 4న రాత్రి 7.50గంటల వరకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలోనే తమ అభ్యంతరాలను తెలపవచ్చని పేర్కొంది. అభ్యంతరాలపై ప్రతి ప్రశ్నకు రూ.200లు చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోపు విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులు పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవే అయితే.. ఆన్సర్ కీని సవరించి తుది కీ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.
ఆన్సర్ కీ, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం! వివరాలు ఇలా!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..