ICAI CA Admit Card: సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ చేసుకోండి! పరీక్షల షెడ్యూలు ఇలా!
పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు పొందవచ్చు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
సీఏ ఇంటర్, ఫైనల్ నవంబరు 2022 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్డెర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. విద్యార్థుల అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు పొందవచ్చు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లడం ఉత్తమం. నవంబరులో ఆఫ్‌లైన్ విధానంలో సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Download ICAI CA Inter Admit Card
Download ICAI CA Final Admit Card
పరీక్షల షెడ్యూలు ఇలా..
* సీఏ ఇంటర్ పరీక్షలకు సంబంధించి గ్రూప్-1 పరీక్షలను నవంబరు 2, 4, 6, 9 తేదీల్లో; గ్రూప్-2 పరీక్షలను నవంబరు 11, 13, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నారు.
గ్రూప్-1:
నవంబరు 2న: అకౌంటింగ్ (పేపర్-1)
నవంబరు 4న: కార్పొరేట్ అండ్ అదర్ లాస్ (పేపర్-2)
నవంబరు 6న: కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ (పేపర్-3)
నవంబరు 9న: టాక్సేషన్ (పేపర్-4)
గ్రూప్-2:
నవంబరు 11న: అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ (పేపర్-5)
నవంబరు 13న: ఆడిటింగ్ అండ్ అస్యురెన్స్ (పేపర్-6)
నవంబరు 15న: ఎంటర్‌ప్రైజ్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ & స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ (పేపర్-7)
నవంబరు 17న: ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ & ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ (పేపర్-8)
* సీఏ ఫైనల్ పరీక్షలకు సంబంధించి గ్రూప్-1 పరీక్షలను నవంబరు 1, 3, 5, 7 తేదీల్లో; గ్రూప్-2 పరీక్షలను నవంబరు 10, 12, 14, 16 తేదీల్లో నిర్వహించనున్నారు.
గ్రూప్-1:
నవంబరు 1న: ఫైనాన్షియల్ రిపోర్టింగ్ (పేపర్-1)
నవంబరు 3న: స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (పేపర్-2)
నవంబరు 5న: అడ్వా్న్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ (పేపర్-3)
నవంబరు 7న: కార్పొరేట్ అండ్ అలైడ్ లాస్ (పేపర్-4)
గ్రూప్-2:
నవంబరు 10న: అడ్వా్న్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ (పేపర్-5)
నవంబరు 12న: ఎలక్టివ్ పేపర్స్ (6A - 6F) (పేపర్-6)
నవంబరు 14న: డైరెక్ట్ టాక్స్ లా (పేపర్-7)
నవంబరు 16న: ఇన్ డైరెక్ట్ టాక్స్ లా (పేపర్-8)
:: ఇవీ చదవండి ::
AISSEE-2023: సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పరీక్ష, ఎంపిక వివరాలు ఇలా!
దేశంలోని సైనిక పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2023)' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
DOST Counselling: 'దోస్త్' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!
ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS EAMCET: ఎంసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 15,447 సీట్లు ఖాళీనే!!
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబరు 25తో పూర్తయింది. కన్వీనర్ కోటాలో 79,346 బీటెక్ సీట్లకుగాను 63,899 మంది సీట్లు పొందారు. సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. అయితే సీట్లు పొందినవారిలో కళాశాలతో చేరే వారి సంఖ్య 55 వేలకు మించదని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆ ప్రకారం చూస్తే కన్వీనర్ కోటాలోనే దాదాపు 24 వేల బీటెక్ సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది.
సీట్లకేటాయింపు, మిగిలిపోయిన సీట్ల వివరాల కోసం క్లిక్ చేయండి..