DOST Counselling: 'దోస్త్' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!
డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు.
ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
* రిజిస్ట్రేషన్: 25.10.2022 - 28.10.2022.
* వెబ్ ఆప్షన్లు: 26.10.2022 - 26.10.2022.
* సర్టిపికేట్ వెరిఫికేషన్ (PH, CAP, NCC): 28.10.2022.
* సీట్ల కేటాయింపు: 28.10.2022.
* ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 29.10.2022 - 31.10.2022.
* కళాశాలలో రిపోర్టింగ్: 31.10.2022.
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను దోస్త్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మూడు లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు.
Also Read:
TS Agricet Result: వెబ్‌సైట్‌లో టీఎస్ అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్ మెరిట్ జాబితా
టీఎస్ అగ్రిసెట్-2022 ఫలితాలను ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అక్టోబర్ 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ రూపొందించింది. అగ్రిసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాలు, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..