అన్వేషించండి

TS Agricet Result: వెబ్‌సైట్‌లో టీఎస్‌ అగ్రిసెట్‌, అగ్రి ఇంజినీరింగ్ సెట్ మెరిట్ జాబితా

అగ్రిసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలు) కూడా యూనివర్సి విడుదల చేసింది.

టీఎస్ అగ్రిసెట్-2022 ఫలితాలను ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అక్టోబర్ 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ రూపొందించింది. అగ్రిసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.

ఫలితాలతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలు) కూడా యూనివర్సి విడుదల చేసింది. ఫలితాల్లో వ్యవసాయ డిప్లొమాలో 940 మంది, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీలో 95 మంది, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్‌లో 62 మంది, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులు 47 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా వ్యవసాయ డిగ్రీ కోర్సులో సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్షను రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో సెప్టెంబర్ 30న నిర్వహించారు.

AGRICET & AGRIENGGCET-2022 RESULTS:

1. AGRICET - 2022 (Agriculture) - Merit List

2. AGRICET - 2022 (Seed Technology) - Merit list

3. AGRICET - 2022 (Organic Agriculture) - Merit list

4. AGRIENGGCET - 2022 (Agricultural Engineering) - Merit List

5. Click here to download - RESPONSE SHEET

Official Website Website

 

ఉన్నత విద్య పరీక్షల విధానంలో మార్పు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఎంవోయూ!
రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్ష విధానంలో గుణాత్మక మార్పులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కమిషరేట్‌ ఆఫ్‌ కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ అక్టోబరు 21న ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విద్యార్థి నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే పరీక్ష విధానం భవిష్యత్‌లో అతనికి గుర్తింపునిచ్చేదిగా, ఉపాధికి బాటలు వేసే విధంగా ఉండాలన్నదే ఈ ఎంవోయు లక్ష్యమని ఉన్నత విద్య మండలి పేర్కొంది.

ఇప్పుడున్న పరీక్షల విధానంలో తీసుకురావాల్సి మార్పులపై ఐఎస్‌బీ అధ్యయనం చేసి, ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనుంది. విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన పరీక్షలు ఎలా ఉండాలనేది క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా తెలుసుకోబోతున్నారు. అంతర్గత పరీక్షలతో సహా కాలేజీ విద్యలో జరిగే అన్ని పరీక్షల విధానాలను పరిశీలించి, సరికొత్త ఫ్రేమ్‌వర్క్‌తో కొన్ని సిఫార్సులు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థి నైపుణ్యాన్ని ఎలా అంచనా వేయాలనేది సూచిస్తుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీయేట్‌ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. నూతన ఆలోచన విధానం, భవిష్యత్‌ మార్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, తాజా ఎంవోయు ఇందుకు నిదర్శనం అని అన్నారు. విద్యావిధానంలో విద్యార్థి నైపుణ్యతను సరికొత్తగా వెలికి తీసేందుకు అధ్యయనం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. 

ఉన్నత విద్యామండలి ఛైర్మన ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పరీక్ష, మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థి కూడా ఉపాధి విషయంలో సవాళ్ళు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల్లోని లోతైన ఆలోచన విధానాన్ని, సమస్యలు పరిష్కరించే సామర్థ్యా‍న్ని అంచనా వేయాలని భావిస్తున్నామని, కానీ ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానంలో వారి జ్ఞాపకశక్తిని మాత్రమే అంచనా వేస్తున్నామని తెలిపారు. ఐఎస్‌బీ దీనిపై సమగ్ర అధ్యయనం చేసి, సరైన మూల్యాంకన విధానం, బోధన ప్రణాళిక తీరు, టీచింగ్‌ మెథడ్స్‌లో తీసుకురావాల్సిన మార్పులను సూచిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget