Civils Coaching: ఉస్మానియా యూనివర్సిటీలో 'సివిల్స్' ఉచిత శిక్షణ, వివరాలు ఇలా!
విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇటీవల ప్రారంభించిన సివిల్ సర్వీసెస్ అకాడమీలో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించేందుకు ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న పీజీ విద్యార్థులను సివిల్స్ విజేతలుగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇటీవల ప్రారంభించిన సివిల్ సర్వీసెస్ అకాడమీలో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించేందుకు ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్‌లుగా మారేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే ఓయూ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరిగేలా, పరీక్షల్లో విజయం సాధించేలా అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు.
స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు..
విద్యార్థులు ఓయూ సివిల్స్ అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందాలంటే ముందుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనున్న అర్హత పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో పాసైన వారికి ఉచితంగా శిక్షణ పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఓయూలో పీజీ చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా 500 మంది నుంచి 600 మంది స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు విశ్వవిద్యాలయంలోని అనుభవజ్ఞులైన ఆచార్యుల వృత్తి నిపుణుల సహకారం తీసుకోనున్నారు.
ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు దీటుగా..
సివిల్స్ శిక్షణ ఇస్తున్న ప్రైవేటు కేంద్రాలకు దీటుగా.. విశ్వవిద్యాలయంలో సివిల్స్ అకాడమీని రూపొందించారు. ఏకకాలంలో 500ల మంది విద్యార్థులు చదువుకునేలా విశాలమైన గదులు, అత్యాధునిక సమాచార పరిజ్ఞానంతో కూడిన శిక్షణ తరగతులు, డిజిటల్ లైబ్రరీతో పాటు కేంద్ర గ్రంథాలయం తరహాలో.. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నామని ఉపకులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు.
Also Read:
TS EAMCET: మార్చిలో ఎంసెట్ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూలు ఇలా!
తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదలకానుంది. అదే సమయంలో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభంకానుంది. ఈ మేరకు జేఎన్‌టీయూహెచ్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ అమలు, కనీసం 45 శాతం మార్కులొచ్చి ఉండాలన్న నిబంధనలను సడలించడమా.. లేదా కొనసాగించడమా అన్న అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ స్పందనను బట్టి వీటి అమలుపై స్పష్టత రానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏయూ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి!
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2023 విద్యాసంవత్సరానికి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 20, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023, నోటిఫికేషన్ విడుదల, అర్హతలివే!
ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2023 నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' విడుదల చేసింది. ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ)లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..