AUCDE Admissions: ఏయూ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి!
ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2023 విద్యాసంవత్సరానికి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు.
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2023 విద్యాసంవత్సరానికి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 20, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సు వివరాలు..
ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్
➥ డిగ్రీ కోర్సులు
➥ బీఏ & బీకామ్
➥ బీఎస్సీ (ఎంపీసీ/ఎంపీసీఎస్/ఎంఎస్‌సీఎస్/సీబీజెడ్ (కెమిస్ట్రీ బయాలజీ, జువాలజీ))
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
⧪ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
➥ ఎంఏ (హిందీ/తెలుగు/ఇంగ్లిష్/ఎకనామిక్స్/హిస్టరీ/పొలిటికల్ సైన్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సోషియాలజీ/ఫిలాసఫీ/ మ్యాథమెటిక్స్)
➥ ఎంజేఎంసీ (మాస్టర్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్)
➥ ఎంకామ్
➥ ఎంహెచ్‌ఆర్ఎం
➥ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ ఆర్గానిక్ కెమిస్ట్రీ)
➥ ఎంబీఏ (HR/ ఫైనాన్స్/ మార్కెటింగ్/ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)
➥ ఎంసీఏ
అర్హత: ఎంఏ (హిందీ/తెలుగు) కోర్సుకు డిగ్రీలో సంబంధిత సబ్జెక్టులు పాఠ్యాంశంగా ఉండాలి. ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ ఆర్గానిక్ కెమిస్ట్రీ) కోర్సులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉండాలి. మిగతా కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
⧪ ఆన్‌లైన్ ప్రోగ్రామ్
➥ బీకాం(అకౌంటెన్సీ)
➥ ఎంఏ(సోషియాలజీ)
అర్హత: బీకామ్ కోర్సుకు ఇంటర్ విద్యార్హత ఉండాలి. ఐటీఐ లేదా ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్, పాలిటెక్నిక్ డిప్లొమా, వెటర్నరీ, అగ్రికల్చర్ డిప్లొమా లేదా మరేదైనా ఇంటర్ తత్సమాన విద్యార్హత ఉండాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2023.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 31.03.2023.
Also Read:
బిట్‌శాట్- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్షలు, జూన్ 18 నుంచి 22 వరకు సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రవేశ ప్రకటన, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపికలు ఉంటాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..