Engineering Fees: కొలిక్కివచ్చిన ఫీజుల పంచాయతీ, ఆ కళాశాలల్లో పెరగనున్న ఫీజులు!
సెప్టెంబరు నెలలో ఖరారు చేసిన బీటెక్ ఫీజులను అంగీకరించని కళాశాలల్లో రుసుములు మారనున్నాయి. విచారణకు హాజరై అభ్యంతరాలను వ్యక్తంచేసి, అవసరమైన ఆధారాలను చూపిన కళాశాలల ఫీజుల మొత్తం కొంత పెరగనుంది.
తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) సెప్టెంబరు నెలలో ఖరారు చేసిన బీటెక్ ఫీజులను అంగీకరించని కళాశాలల్లో రుసుములు మారనున్నాయి. విచారణకు హాజరై అభ్యంతరాలను వ్యక్తంచేసి, అవసరమైన ఆధారాలను చూపిన కళాశాలల ఫీజుల మొత్తం కొంత పెరగనుంది. ఫలితంగా కొద్ది నెలలుగా సాగుతున్న ఫీజుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్లయింది. ఫీజుల వ్యవహారం కొలిక్కి రావడంతో మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది.
అసలేం జరిగింది?
ఇంజినీరింగ్ ఫీజుల విషయమై సెప్టెంబరు 24న విచారణ జరిపిన టీఏఎఫ్ఆర్సీ ఫీజులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్ కళాశాలలు ఇందుకు అంగీకరించాయి. అయితే 20 కళాశాలలు మాత్రం ఈ ఫీజులను అంగీకరించలేదు. వీటిలో సీబీఐటీ, నారాయణమ్మ, వర్ధమాన్, శ్రీనిధి, వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి, అనురాగ్, విద్యాజ్యోతి, కేఎంఐటీ, మల్లారెడ్డి, సీఎంఆర్ గ్రూపుల్లోని మరికొన్ని కళాశాలలున్నాయి. దీంతో కమిటీ మరోసారి వారి అభ్యంతరాలను వినాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కళాశాలల ప్రతినిధులతో అక్టోబరు 3న సుదీర్ఘంగా చర్చించింది. కళాశాలల విజ్ఞప్తులను, పత్రాలను పరిశీలించింది. అనంతరం ఆయా కళాశాలలు కొంత మొత్తాన్ని పెంచుకునేందుకు కమిటీ అంగీకరించింది.
Also Read: EAMCET Counselling: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!
ఎంజీఐటీ టాప్..
ఈసారి అత్యధిక ఫీజు ఎంజీఐటీకి రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా.. అత్యల్ప ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించారు. ఇక సీబీఐటీకి పాత ఫీజు రూ.1.34 లక్షలు ఉండగా, గత జులైలో రూ.1.73 లక్షలుగా కమిటీ ఖరారు చేసింది. తిరిగి గత నెలలో విచారణ జరిపి దాన్ని రూ.1.12 లక్షలకు కుదించింది. తాజాగా దాన్ని రూ.1.30 లక్షలకుపైగా పెంచినట్లు తెలిసింది. ఇతర కళాశాలలకు కూడా రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచినట్లు సమాచారం.
Also Read:
NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
నీట్ యూజీ (NEET UG) 2022 కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 11 నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అక్టోబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..
EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) 2022-2023 విద్యా సంవత్సరానికి వివిద విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..