News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

FOLLOW US: 
Share:

నీట్‌ యూజీ (NEET UG) 2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబరు 11  నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) అక్టోబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, సెంట్రల్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.


సీట్ల వివరాలు..
నీట్ అడ్మిషన్ ప్రక్రియలో వివిధ కేటగిరీల సీట్లు ఉంటాయి. ఈ జాబితాలో ఆల్ ఇండియా కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు, కేంద్రీయ సంస్థలు/యూనివర్సిటీలు/డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు, ప్రైవేట్ మెడికల్/డెంటల్ కాలేజీలు లేదా ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో స్టేట్/మేనేజ్‌మెంట్/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు, సెంట్రల్ పూల్ కోటా సీట్లు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్/ఎయిడెడ్ మైనారిటీ/నాన్-మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా అలాగే మేనేజ్‌మెంట్ సీట్లు, దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు/జిప్‌మర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.


నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా...
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 11న నీట్ మొదటివిడత కౌన్సెలింగ్ మొదలుకానుంది. సెంట్రల్ కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబరు 11 నుంచి 20 వరకు ఆల్ ఇండియా కోటాలో, అక్టోబరు 10 నుంచి 20 వరకు డీమ్డ్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక అక్టోబరు 17 నుంచి 28 వరకు మొదటి విడత స్టేట్ కౌన్సెలింగ్ జరుగనుంది. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు అక్టోబరు 28లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 4లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. 


నవంబరు మొదటివారంలో రెండో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 20222 రెండో విడత కౌన్సెలింగ్ నవంబరు 2 నుంచి ప్రారంభంకానుంది. సెంట్రల్ కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబరు  2 నుంచి 10 వరకు ఆల్ ఇండియా కోటాలో, ఇక నవంబరు 7 నుంచి 18 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 18లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 21లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. 


నవంబరు 23 నుంచి చివరి విడత (మాపప్ రౌండ్) కౌన్సెలింగ్..

నీట్ యూజీ 2022 మొదటి, రెండో విడతల్లో సీట్లు పొందలేని విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రయత్నంచేయవచ్చు.  నవంబరు 23 నుంచి డిసెంబరు 1 వరకు సెంట్రల్ కౌన్సెలింగ్.. అలాగే డిసెంబరు 6 నుంచి 12 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 10 లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 16 లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. 


మిగిలిపోయిన సీట్లకు...

మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేస్తారు. డిసెంబరు 12 నుంచి 14 వరకు ఆల్ ఇండియా కోటాలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 20లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

Official website


నవంబరు 15 నుంచే తరగతులు..
నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులకు నవంబరు 15 నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి. అయితే బీడీఎస్/బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు సంబంధించి రెండో విడత మాపప్ కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ షెడ్యూలును వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. విద్యార్థులు శని, ఆదివారాల్లోనూ సంబంధింత కళాశాల్లో రిపోర్టింగ్ చేయవచ్చు.  


నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు మొత్తం 18,72,343 మంది రిజిష్టర్ చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది మహిళలు; 5,63,902 మంది పురుషులు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అంటే 56.27 శాతం ఉత్తీర్ణులయ్యారు. 


Also Read:

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..


EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ‌2022-2023 విద్యా సంవత్సరానికి వివిద విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు. 
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 04 Oct 2022 11:46 AM (IST) Tags: NEET National Eligibility cum Entrance Test NEET UG 2022 NEET UG 2022 Counselling schedule NEET UG 2022 Counselling neet counselling news all india quota counselling

ఇవి కూడా చూడండి

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు

TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు